శ్రీరాంసాగర్ @ 77టీఎంసీలు

Thu,October 10, 2019 02:41 AM

-14,810 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
-జూరాలకు స్వల్పంగా వరద
-నాగార్జునసాగర్‌కు 88,897 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
మెండోరా: ఉత్తర తెలంగాణ వరప్రదాయని నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటినిల్వ 77 టీఎంసీలకు చేరుకున్నది. ఎగువ నుంచి 14,810 క్యూసెక్కుల వరద వస్తుండటంతోనీటిమట్టం క్రమేపి పెరుగుతున్నది. బుధవారం ఉదయం 6 గంటలకు 8,170 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. మధ్యా హ్నం 14,810 క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో పెరిగిందని ప్రాజెక్టు ఏఈఈ మహేందర్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (90.313 టీఎంసీలు)కాగా, బుధవా రం సాయంత్రానికి 1088.30 అడుగులు (77.383 టీఎంసీలు) నీటి నిల్వ ఉందని చెప్పారు. ప్రాజెక్టు నుంచి 771 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నదని తెలిపారు.


-కృష్ణాబేసిన్‌లో కొనసాగుతున్న వరద
కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న ఓ మోస్తరు వానలకు ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులకు వరద వచ్చి చేరుతుండటంతో జూరాలకు వరద స్థిరంగా వస్తున్నది. దీంతో జూరాల స్పిల్‌వే గేటు ఒకటి తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో పెరుగుతుండటంతో 10 స్పిల్ వే గేట్లను ద్వారా15,370 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

-శ్రీశైలం నుంచి దిగువకు
జూరాల నుంచి భారీగా వస్తున్న వరద కారణంగా ఈ సీజన్లలో నాలుగోసారి శ్రీశైలం ప్రాజెక్టు ఒక గేట్ ఎత్తి నీటిని దిగువకు వదిలారు. బుధవారం సాయంత్రం 80,760 క్యూసెక్కులు నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తుండగా, ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 884 అడుగులకు చేరి 214 టీఎంసీలకు చేరుకున్నది. ప్రాజెక్టు ఒక వదులుతున్నారు. శ్రీశైలం నుంచి 88,897 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నాలుగు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు. బుధవారం ఎన్నెస్పీ అధికారులు నాలుగు క్రస్టుగేట్లను ఎత్తి 46,226 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

176
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles