హడ్కో అవార్డుల్లో తెలంగాణ టాప్


Thu,April 26, 2018 02:40 AM

Five Hudco Award for Telangana to 2BHK And Other Projects

-ఐదింటితో అగ్రస్థానంలో రాష్ట్రం
-డబుల్ బెడ్‌రూంకు డబుల్ ధమాకా
-అవార్డు అందుకున్న హౌసింగ్ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్
-అర్బన్ భగీరథకు, గ్రేటర్ వరంగల్‌కు పురస్కారాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) అందించే ప్రతిష్ఠాత్మకమైన అవార్డుల్లో రాష్ర్టం ఐదింటిని సొంతం చేసుకుని అగ్రగామిగా నిలిచింది. దేశంలోనే అద్వితీయం అనిపించుకున్న డబుల్ బెడ్‌రూం పథకం డబుల్ ధమాకా సాధించింది. ఈ విశిష్ట పథకానికి రెండు అవార్డులు దక్కాయి. గ్రేటర్ వరంగల్, అర్బన్ మిషన్ భగీరథకు చెరొక అవార్డు లభించింది. హడ్కో 48వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలోని హాబిటాట్ సెంటర్ ైస్టెన్ ఆడిటోరియంలో జరిగిన ప్రదానోత్సవంలో గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఈ అవార్డులను అందుకున్నారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్ సింగ్‌పూరి ఈ అవార్డులను ప్రదానం చేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో మెరుగైన పనితీరును కనబర్చినందుకు తెలంగాణ గృహనిర్మాణశాఖకు హడ్కో డిజైన్ అవార్డు దక్కింది.బెస్ట్ ప్రాక్టీసెస్ విభాగంలో తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు అవార్డు దక్కింది. ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ కన్జర్వేషన్, గ్రీన్ బిల్డింగ్స్ విభాగంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు హడ్కో అవార్డు ప్రదానంచేశారు. అర్బన్ భగీరథకు కూడా అవార్డు లభించింది. కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ భారతి, గృహనిర్మాణశాఖ చీఫ్ ఇంజినీర్ సత్యమూర్తి హాజరయ్యారు.

hudco-awards

ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతుకాలి

ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతుకాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్‌రూం ఇండ్లకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది మార్చికల్లా జీహెచ్‌ఎంసీతో పాటు ఆయా జిల్లాల్లో డబుల్ బెడ్‌రూం ఇండ్లను అందిస్తాం. హైదరాబాద్‌లో దాదాపు 96 వేల ఇండ్లకు ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును గుర్తిస్తూ హడ్కో రాష్ట్ర గృహనిర్మాణశాఖకు రెండు అవార్డులను బహూకరించింది.
- చిత్రా రామచంద్రన్, రాష్ట్ర గృహనిర్మాణశాఖ
ప్రత్యేక ప్రధానకార్యదర్శి

hudco-awards3

అర్బన్ భగీరథకు అవార్డు దక్కడం సంతోషం

అర్బన్ భగీరథకు హడ్కో అవార్డు దక్కడం సంతోషంగా ఉం ది. ఇంతకాలం హైదరాబాద్ వరకే మంచినీరు ఏ సమస్యా లేకుండా అందేది. సీఎం కేసీఆర్ అర్బన్ మిషన్ భగీరథ పథకంతో శివారు ప్రాంతాల దాహార్తిని తీర్చారు. 279 మిలియన్ల సామర్థ్యంతో 56 రిజర్వాయర్లను శివారు ప్రాంతాల్లో నిర్మించి, సురక్షిత మంచినీరు అందిస్తున్నారు. దేశంలోనే తొలిసారి ఇంతపెద్ద ప్రాజెక్టును లక్ష్యంలోపే పూర్తి చేశాం.
-దానకిషోర్, జలమండలి ఎండీ

hudco-awards2

స్వచ్ఛత విషయంలో ముందున్నాం

దేశంలోనే స్వచ్ఛత విషయంలో వరంగల్ ముందువరుసలో ఉన్నది. టాయిలెట్ల నిర్మాణం తర్వాత వాటి నుంచి వచ్చే వ్యర్థాలను ఉపయోగించే ప్రక్రియలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అవార్డు దక్కింది. వరంగల్ సిటీపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు.
-ఆమ్రపాలి, వరంగల్‌అర్బన్ కలెక్టర్

hudco-awards4

తెలంగాణకు ఐదు అవార్డులు రావడం సంతోషం

వినూత్న పథకాలు, పనితీరుతో తెలంగాణ రాష్ట్రం ఐదు అవార్డులను సొంతం చేసుకోవడం సంతోషంగా ఉంది. మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకానికి మా పరిధులను పెంచి తెలంగాణ ప్రభుత్వానికి రుణాలు అందించాం. మా అంచనాలను మించి తెలంగాణ ప్రభుత్వం విజయాలను సాధిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం చెప్పినవిధంగానే విజయాలను సొంతం చేసుకున్నందుకు హడ్కో చైర్మన్‌గా.. తెలంగాణ వ్యక్తిగా సంతోషిస్తున్నాం.
-రవికాంత్, హడ్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్

1367
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles