తుపాకుల సరఫరా ముఠా అరెస్టు


Fri,July 12, 2019 01:19 AM

Firearms gang arrested

వరంగల్ క్రైం: తుపాకులు సరఫరా చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను వరంగల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీపీ రవీందర్ కథనం ప్రకారం.. న్యూడెమోక్రసీ పార్టీ సానుభూతిపరుడు జన్ను కోటి, ప్రజా ప్రతిఘటన పార్టీలో పని చేసిన వాయినాల రవిలు సంతోష్‌తో కలిసి ఉత్తరాది రాష్ర్టాల్లో తుపాకులు కొనుగొలు చేసి ఎక్కువ ధరకు అమ్మాలని పథకం రచించారు. ఈ క్రమంలో గతంలో న్యూడెమోక్రసీలో పని చేసిన అబ్బర్ల రాజయ్య, మొగిలి ప్రతాప్‌రెడ్డి తుపాకులతో బెదిరించి డబ్బులు వసూలు చేయాలని జన్ను కోటితో ఒప్పందం కుదుర్చుకున్నారు. మధ్యప్రదేశ్‌లో కోటి, సంతోష్, రవి, మల్లికార్జున్‌లు 9 ఎంఎం పిస్తోల్ కొనుగోలు చేసి గురువారం ప్రతాప్‌రెడ్డి, రాజయ్యలకు దానిని ఇవ్వడానికి గిర్నిబావికి రాగా పోలీసులు అదుపులోకి తీసుకుని 9 ఎంఎం పిస్తోల్, రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల సమాచారంతో మరో నిందితుడు మల్లికార్జున్‌ను కొమ్మాలలో అదుపులోకి తీసుకుని ఆయన నుంచి మరో 9 ఎంఎం పిస్తోల్, 4 బుల్లెట్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు.

312
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles