జిల్లాలవారీగా ఎరువులను స్టాక్ పెట్టాలి


Thu,September 13, 2018 01:14 AM

Fertilizers should be stocked by districts

అధికారులకు వ్యవసాయశాఖ
ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఆదేశం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో జిల్లాలవారీగా పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని, ఆ మేరకు ఎరువుల నిల్వలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలోని సీ-బ్లాక్‌లో వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జాతో కలిసి జిల్లా వ్యవసాయాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పంటల సాగు, రైతుబంధు, రైతుబీమా లపై సమీక్షించారు. జిల్లాలవారీగా ఏఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు? ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు ఏమేర పంట నష్టం జరిగిందో త్వరగా అం చనావేసి వివరాల ను నిర్ణీత నమూనా లో కమిషనర్ కా ర్యాలయానికి పం పాలని ఆదేశించా రు. రైతుబంధు పథకంలో పంపిణీ చేసిన చెక్కులను, పంపిణీ చేయని చెక్కులను ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయశాఖశాఖ అడిషనల్ డైరెక్టర్ కే విజయకుమార్, జాయింట్ డైరెక్టర్లు బాలునాయక్, విజయగౌరీ, వివిధ పథకాల డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

30లోగా వానకాల పంటరుణ లక్ష్యం సాధించాలి


ఈ ఏడాది వానకాలం పంట రుణాల లక్ష్యాన్ని ఈ నెల 30లోగా పూర్తిచేయాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి బ్యాంకర్లను కోరారు. బుధవారం హైదరాబాద్ అబిడ్స్‌లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్సెల్బీసీ) సమావేశం నిర్వహించారు. త్వరలో అమలుచేయనున్న యాసంగి రెండోవిడుత రైతుబంధు కార్యక్రమం, 2018 వానకాలంలో పంట రుణాల చెల్లింపులపై బ్యాంకర్లతో పార్థసారథి చర్చించారు. రైతుబంధుకు సంబంధించిన అంశంపై చర్చించేందుకు త్వరలోనే మరోసారి సమావేశం కానున్నట్టు చెప్పారు. సమావేశంలో ఎస్సెల్బీసీ కన్వీనర్, వ్యవసాయశాఖ కమిషనర్, ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీ, వివిధ బ్యాంకుల అధికారులు, ఎన్‌ఐసీ సిబ్బంది పాల్గొన్నారు.

423
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS