బడిలో అడుగు పెట్టకుండానే..


Wed,June 12, 2019 03:18 AM

Father Drives Tractor 3 Years Old Child Dead at Cherlabuthkur in Karimnagar District

-పసిమొగ్గను చిదిమిన ట్రాక్టర్
-కరీంనగర్ జిల్లాలో విషాదం

కరీంనగర్ క్రైం: తెల్లారితే బడిలో చేరాల్సిన చిన్నారి అంతలోనే కన్నుమూసింది. తండ్రి నడుపుతున్న ట్రాక్టర్ కింద ప్రమాదవశాత్తు పడటంతో ప్రాణాలు వదిలిన ఘటన కరీంనగర్ జిల్లా చెర్లబూత్కుర్‌లో జరిగింది. సీఐ శశిధర్‌రెడ్డి కథనం ప్రకారం. చెర్లబూత్కుర్‌కు చెందిన జక్కు ప్రసాద్-లావణ్య దంపతులకు కూతురు రితిక(3), ఏడాది బాబు ఉన్నారు. ఈ మధ్యే కూతురికి అక్షరాభ్యాసం చేయించారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే పాఠశాలలకు పంపించేందుకు షాపింగ్ కూడా చేశారు. కాగా మంగళవారం రితిక ఇంటిముందున్న ఖాళీస్థలంలో ఆడుకుంటుండగా.. అదే సమయం లో పొలం పనుల కో సం తండ్రి ప్రసాద్ ట్రా క్టర్ తీశాడు. కూతురిని గమనించకుండా ట్రాక్టర్‌ను వెనక్కి తీయడం తో అక్కడే ఆడుకుంటున్న రితికపైకి చక్రాలు వెళ్లాయి. తీవ్ర గాయాలైన చిన్నారిని దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందింది. కు టుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

3048
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles