ఆ రెండెకరాలు ఎక్కడ?


Mon,July 22, 2019 01:54 AM

Farmers Suffering who gave 12 acres to SC Corporation

-ఎస్సీ కార్పొరేషన్‌కు 12 ఎకరాలు ఇచ్చిన రైతులు
-పదెకరాలకే డబ్బులు ముట్టజెప్పిన అధికారులు

రాజోళి: రెవెన్యూ అధికారుల అలసత్వం కారణంగా ప్రభుత్వ పథకాల అమలుకోసం ఎస్సీ కార్పొరేషన్‌కు భూమిని ఇచ్చిన రైతులు అవస్థపడుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం నౌరోజీ క్యాంపునకు చెం దిన నల్లాని వెంకటేశ్వర్లు, నల్లాని హనుమంతరావు, బొబ్బా రామ్మోహన్‌రావుకు రాజోళి మండలం పెద్ద దన్వాడ గ్రామ శివారులోని సర్వే నంబర్లు 148, 149, 160లలో 12 ఎకరాల భూమి ఉండేది. వారు ఈ భూమిని 2018 జనవరి 25న అప్పటి తాసిల్దార్ వరలక్ష్మి ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్‌కు అప్పగించారు. దళితులకు మూడెకరాల భూ పంపి ణీ పథకం కోసం దీనిని సేకరించిన అధికారులు.. అందులో పదెకరాలకు మాత్రమే భూ యజమానులకు డబ్బులిచ్చారు.

మిగతా రెండెకరాలకు డబ్బు ఇవ్వలేదు. ఎస్సీ కార్పొరేషన్‌కు తాము ఇచ్చిన భూమిని సర్వే చేసేటప్పుడు కూడా తమకు సమాచారం ఇవ్వకుండానే కొలతలు వేసుకొని.. రిజిస్ట్రేషన్ చేశారని, మిగిలిన రెండెకరాలు ఎక్కడ ఉన్నదో తమకు చూపించలేదని రైతులు వాపోతున్నా రు. కాగా, ఎస్సీ కార్పొరేషన్‌కు భూమిని ఇచ్చి న ముగ్గురు రైతుల్లో బొబ్బా రామ్మోహన్‌రావు మరణించారు. ఆయన పేరుతో భూమిలేకపోవడంతో.. ఆయన కుటుంబానికి రైతుబీమా పథకం వర్తించలేదు. అధికారులు మిగిలిన రెండెకరాల్లో తమ వాటా తమకు అప్పగించి ఉంటే.. రామ్మోహన్‌రావు కుటుంబానికి రైతుబీమా సొమ్ము అందేదని తోటి రైతులు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారు లు స్పందించి తమకు మిగిలిన భూమిని చూపించి అప్పగించాలని, లేదంటే ఆ భూమి ని ఎస్సీ కార్పొరేషన్‌కైనా చెందేలా చేయాలని కోరుతున్నారు.

ఇబ్బందులు పెడుతున్నారు


నల్లాని వెంకటేశ్వర్‌రావు, బాధిత రైతు

మేము ఇచ్చిన 12 ఎకరాల్లో పదెకరాలకు మాత్రమే ఎస్సీ కార్పొరేషన్ నుంచి డబ్బు అందింది. మిగిలిన రెండెకరాలకు రాలేదు. ఆ రెండెకరాలను కూడా ఎస్సీ కార్పొరేషన్‌కు ఇస్తామన్నా తీసుకోవడంలేదు. మాకు భూమిని చూపించడంలేదు. దీంతో మేము నష్టపోతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయంచేయాలి.

128
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles