వీఆర్వో చిక్కడు..దొరకడు


Sat,May 25, 2019 01:32 AM

Farmers Suffering Revenue Officers Neglect For Land Registration

యాచారం: తన భూమికి సంబంధించిన డాక్యుమెంటు, ప్రొసీడింగ్, అన్‌లైన్ పహా ణీ, పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్నప్పటికీ అధికారులు కొత్త పాస్‌పుస్తకాలివ్వడంలేది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండ లం చెర్లపటేల్‌గూడ గ్రామానికి చెందిన కొర్వి సురేందర్ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. యాచారం మండలం తాడిపర్తి గ్రామంలో 2013లో దార కిష్టయ్య అనే రైతువద్ద సర్వే నంబర్ 178లో సురేందర్ ఎకరా పొలాన్ని కొనుగోలు చేశారు. ఎకరా పొలానికి అధికారులు 2014లో ప్రొసీడింగ్‌తోపాటు పాస్‌పుస్తకాలిచ్చారు. మొదట్లో ఆన్‌లైన్ పహాణీ కూడా వచ్చిం ది. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం తన ఎకరా పొలానికి సంబంధించిన ఆన్‌లైన్ పహాణీ రావడంలేదని సురేందర్ ఆవేదన చెందుతున్నారు. వీఆర్వో యాదగిరి నిర్లక్ష్యంతోనే కొత్త పాస్‌పుస్తకాలు రావడంలేదన్నారు. పాస్‌పుస్తకాల కోసం తాసిల్దార్ కార్యాలయం చుట్టూ ఏడాదికాలంగా తిరుగుతున్నప్పటికీ అధికారులు కనికరం చూపించడంలేదని చెప్పారు. వీఆర్వో.. పంచాయతీ కార్యాలయంలో, తాసిల్దార్ కార్యాలయంలో ఎప్పుడూ ఉం డరని, కలిసినప్పుడు రేపు మాపు అంటూ తిప్పుతున్నారని మండిపడుతున్నారు. వీఆర్వో నిర్లక్ష్యంతో పాస్‌పుస్తకాలు రాకపోవడంతోపాటు రెండు దఫాలుగా రైతుబంధు పథకం కోల్పోయానన్నారు.

ఫైల్‌ను పరిశీలిస్తా
గతంలో ధరణి పనిచేయకపోవడంతో కొత్త పాస్‌పుస్తకాల జారీలో జాప్యం కొనసాగింది. సురేందర్ ఫైల్‌ను పరిశీలించి వెంటనే ఆన్‌లైన్‌లో ఎక్కించి కొత్త పాస్‌పుస్తకం ఇచ్చేందుకు కృషిచేస్తా.
- వీఆర్వో యాదగిరి

894
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles