నాలుగేండ్లయినా పాస్‌బుక్ అందలే


Sat,September 14, 2019 02:02 AM

Farmers Struggles For Land Registration

-కాళ్లు మొక్కినా తాసిల్దార్ కనికరించడంలేదు
-తొర్రూరు ఆర్డీవో ఎదుట బాధితుడి అర్ధనగ్న నిరసన

నర్సింహులపేట: కొన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకొని.. పాస్‌బుక్ కోసం నాలుగేండ్లు గా తిరుగుతున్నా తాసిల్దార్ కనికరించడం లేదని, న్యాయంచేయండంటూ శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పాండ్యతండాకు చెందిన రైతు గుగులోత్ సుదర్శన్.. తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య ఎదుట అర్ధనగ్నంగా నిరసన తెలిపి, కాళ్లు మొక్కి వినతిపత్రం అందజేశారు. పూర్తి సమాచారం బాధితుడి మాటల్లోనే.. ఇటీవల నా తండ్రి చనిపోయాడు. అమ్మ అచేతన స్థితి లో ఉన్నది. నేను ఒక్కడినే కుమారుడిని. సర్వే నంబర్ 403అ3లో 1.20 ఎకరాల భూమి నాకు వారసత్వంగా వచ్చింది. దీనికి తోడు మా చిన్నాన్న ముని వద్ద సర్వే నంబర్ 403అ2లో 12 గుంటలు కొన్నాను. ఈ మొత్తం భూమికి బుక్ కోసం నాలుగేండ్ల కింద సాదాబైనామాలో దరఖాస్తు చేసుకొన్నాను. అప్పటి నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

భూమి రిజిస్ట్రేషన్ చేయించుకొంటే పాస్‌పుస్తకం ఇస్తామని తాసిల్దార్ మాధవి చెప్పారు. రూ.30 వేలు ఖర్చుచేసి 1.32 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయిచుకొన్నాను. తాసిల్దార్ మాధవికి ఎన్నోసార్లు మొరపెట్టుకొన్నా.. కాళ్లు మొక్కి నా పట్టించుకోవడం లేదు. నాతోపాటు దరఖాస్తు చేసుకొన్న రైతులకు పాస్‌పుస్తకం ఇచ్చా రు. నాకు ఇవ్వకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని తాసిల్దార్‌ను అడిగితే.. వాళ్లు ఖర్చు పెట్టారు. నీవు ఖర్చు పెట్టవా.. అని ఎదురు ప్రశ్నించారు. మీరే నాకు న్యాయం చేయాలి అని ఆర్డీవోకు విన్నవించారు. ఈ విషయంపై ఆర్డీవో మాట్లాడుతూ.. త్వరలోనే పట్టాదారు పాస్‌పుస్తకం అందేలా చర్య తీసుకొంటామని హమీ ఇచ్చారు.

377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles