నా భూమి మరొకరికి పట్టా!


Fri,July 12, 2019 01:51 AM

Farmers Says Revenue Officers Hung Mistakes In Pattadar Passbooks

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నా పేరు గుర్రప్పగారి సత్యనారాయణ. తండ్రి పేరు రాజయ్య. మాది సిద్దిపేట జిల్లా మిర్‌దొడ్డి మండలం అల్వాల గ్రామం. అదే గ్రామంలోని సర్వే నంబర్లు 459/అ, 459/ఆ3, 459/ఇ, 461/అ, 461/ఆ, 461/ఇ లో 24 గుంటల భూమిని గుర్రప్పగారి రాములు, గుర్రప్పగారి కమలమ్మ నుంచి 2017లో కొనుగోలుచేశాను. నేను రిజిస్ట్రేషన్ చేయించుకొన్న తర్వాత.. పాస్‌బుక్‌ను నా పేరిట మంజూరుచేసేందుకు ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని 2017 డిసెంబర్‌లో రెవెన్యూ అధికారులు నోటీసులు జారీచేశారు. అల్వాల నుం చి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో నా పేరిట పట్టా మంజూరుచేయాలని ఆర్డర్‌కాపీని కూడా ఇచ్చారు. కానీ, భూరికార్డుల ప్రక్షాళన తర్వాత.. నా పేరిట కాకుండా గడీల సత్యనారాయణ పేరిట కొత్త పాస్‌బుక్‌ను జారీచేసిన రెవెన్యూ అధికారులు.. పహాణీలోనూ ఆయన పేరే నమోదుచేశారు. రైతుబంధు సాయం కూడా ఆయనకే ఇస్తున్నారు. దీనిపై అప్పటి వీఆర్వోకు ఎన్నిసార్లు మొరపెట్టుకొన్నా, ఆధారాలన్నీ చూపించినా రేపు.. మాపు అంటూ కాలయాపన చేశారు. తాసిల్దార్‌కు దరఖాస్తుచేసినా పట్టించుకోలేదు.

ఈలో గా అప్పటి అధికారులు బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చిన అధికారులకు నా సమస్యను వివరిస్తే మాకు తెలువదంటున్నారు. గడీల సత్యనారాయణకు మంజూరుచేసిన పాస్‌బుక్‌లో సర్వే నంబర్లు 459/అ, 461/అ లో గల భూమి ఆయనకు అనువంశికమని నమోదుచేశారు. వాస్తవానికి ఆ భూమి కొత్త పాస్‌బుక్‌లు మంజూరుచేయకముందు గుర్రప్పగారి రాములు, గుర్రప్పగారి కమలమ్మ పేరిట ఉన్నది. ఈ భూమిని గడీల సత్యనారాయణకు అనువంశికమని రెవెన్యూ అధికారులు ఎలా నమోదుచేస్తారు. నేను కొనుగోలుచేసిన భూమిని వేరే వ్యక్తి పేరిట పాస్‌పుస్తకం మం జూరు చేయడం అన్యాయం. అధికారులు చేసిన తప్పిదం వల్ల నేను రెండు విడుతల రైతుబంధు సాయం నష్టపోయాను. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారించి నా భూమి కి పాస్‌పుస్తకం ఇప్పించాలి.

ఆధారాలుంటే పట్టాచేస్తాం

ఈ సమస్య గత అధికారుల తప్పిదం వల్ల తలెత్తింది. ఇద్దరి పేర్లతోపాటు వారి తండ్రుల పేర్లు కూడా ఒకటే కావడంతో అధికారులు పొరబడి ఉంటారు. గుర్ర ప్పగారి సత్యనారాయణ వద్ద భూమి తనదేనని ఆధారాలుంటే పరిశీలించి పాస్‌పుస్తకం మంజూరుచేస్తాం.
- పద్మారావు, మిర్‌దొడ్డి తాసిల్దార్

325
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles