రాజాపేటలో రైతుల నిరసన


Fri,July 12, 2019 01:58 AM

Farmers Protest in Rajapet

-కార్యాలయంలోకి తాసిల్దార్ వెళ్లకుండా అడ్డగింత
-భూసమస్య పరిష్కరించాలని ఐదుగంటలపాటు ఆందోళన
-పురుగులమందు తాగేందుకు యత్నించిన బాధితులు
-వారంరోజుల్లో పరిష్కరిస్తామని తాసిల్దార్ పద్మావతి హామీ

రాజాపేట: ఏండ్ల కింద కొన్న భూమిని సాగుచేసుకొంటూ పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందారు.. అయితే అమ్మివారే భూమి తమ దే అంటూ కబ్జాపైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నా రు.. తమ వద్ద కూడా పాస్‌పుస్తకాలు ఉన్నాయని బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొత్త పాస్‌పుస్తకాల కోసం తాసిల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోక పోవడం తో ఆగ్రహించిన కాస్తులో ఉన్న రైతులు.. గురువారం కుటుంబంతో కలిసి ఐదు గంటలపాటు తాసిల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో జరిగింది. మండలంలోని నెమిలకు చెందిన మంత్రి స్వామి.. ఆదే గ్రామానికి చెందిన బింగి కైలాసం వద్ద సర్వే నంబర్ 223లో 1.28 ఎకరాల భూమిని 1997 సంవత్సరంలో కొన్నారు. ఆ భూమిని స్వామి కుమారులు కిష్టయ్య, సిద్ధులు, మల్లేశం సమానంగా పం చుకొన్నారు. ఒక్కొక్కరికీ 22 గుంటల భూమి రాగా సాగుచేసుకొంటూ జీవిస్తున్నారు. 2008 అమైన్‌మెంట్ ద్వారా పట్టాదారు పాస్‌పుస్తకాలు కూడా వచ్చాయి. పొజీషన్ సర్టిఫికెట్ కోసం మూడేండ్లుగా తాసిల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.

కొద్ది రోజులుగా తమకు భూమి అమ్మిన బింగి కైలాసం కుమారుడు వైకుంఠం స్థలం తమదేనని, పాస్‌పుస్తకాలు తమ పేరిట ఉన్నాయని, కొన్న రైతులను వెంటనే కబ్జా నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారులు కావాలనే భూమి అమ్మిన వ్యక్తికే పాస్‌పుస్తకాలు అందజేసి అక్రమాలకు పాల్పడుతున్నారని బాధిత రైతులు ఆరోపించారు. కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం తిరిగి తిరిగి విసిగి వేసారిన ఆ మూడు కుటుంబాల సభ్యులు ఆగ్రహించి తాసిల్ కార్యాలయం ఎదుట ఐదుగంటలపాటు బైఠాయించారు. భూసమస్య పరిష్కరించే వరకు తాసిల్దార్ పద్మావతిని కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకొన్నారు. అధికారులు పొంతనలేని సమాధానం చెప్పడంతో అసహనానికి గురైన రైతులు కిరోసిన్ ఒంటిమీద పోసుకొని, పురుగులమందు తాగేందుకు యత్నించగా అక్కడున్న మిగతా రైతులు అడ్డుకొన్నారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తాసిల్దార్ పద్మావతి హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు.

487
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles