బానోత్ బాల్య భూమిని సర్వే చేయిస్తాం


Wed,June 19, 2019 02:05 AM

Farmer Suffering Revenue Officers Neglect For Pattadar Passbook

-అర్హత ఉంటే పాస్‌బుక్ జారీచేస్తాం
-పట్టా పాస్‌పుస్తకం ఇప్పించండి.. అనే కథనంపై స్పందించి..
-విచారణ చేపట్టిన చెన్నారావుపేట తాసిల్దార్

చెన్నారావుపేట: వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట గ్రామ శివారు ఈర్యతండాకు చెందిన రైతు బానోతు బాల్యకు సంబంధించిన భూమిని సర్వే చేయించి, రెండ్రోజుల్లో నివేదిక సమర్పిస్తానని తాసిల్దార్ సదానందం చెప్పా రు. పట్టా పాస్‌పుస్తకం ఇప్పించండి.. అనే శీర్షికతో ఆదివారం ధర్మగంటలో ప్రచురితమైన కథనంపై స్పందించిన తాసిల్దార్ విచారణ చేపట్టారు. తమ విచారణలో బా నోతు బాల్య చెన్నారావుపేట శివారులోని 4.11 ఎకరాల భూమిని 33 ఏండ్ల నుంచి సాగుచేస్తున్నట్టు తే లిందన్నారు.బాల్య ఆ భూమిని పలువురు రైతుల నుంచి కోనుగోలుచేశాడని, పహాణీ రికార్డుల్లో నమోదు చేయించుకోలేదని వివరించారు. అంతేకాకుండా మో ఖాపై ఉన్న భూమికి, అర్జిదారు సమర్పించిన సాదాబైనామా కొనుగోలు కాగితాల్లోని లెక్కలకు తేడా ఉన్నదని చెప్పారు. సదరు భూములకు సంబంధించిన కాగితాలు కూడా సరిగాలేవని.. ఈ భూమిని సర్వే చేయించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. సర్వే ప్రకారం అర్హత ఉంటే వెంటనే రైతుకు పాస్‌పుస్తకంజారీచేస్తామని తాసిల్దార్ చెప్పారు.

518
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles