ఏడాది నుంచి తిరుగుతున్న..


Mon,June 17, 2019 01:47 AM

Farmer suffer Revenue Officer Neglect Land Registration

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మా నాన్న వీరయ్యకు నలుగురం కొడుకులం. సంగారెడ్డి మండలంలో ఆయనకు 3.6 ఎకరాల భూమి ఉన్నది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేలో.. మా చిన్న తమ్ముడైన సంజీవయ్య ఈ మొత్తం భూమిని మాకు తెలియకుండా తన పేరిట పహాణీలో ఎక్కించుకున్నాడు. ఇది గమనించిన వెంటనే మేము సంగారెడ్డి తాసిల్దార్‌ను 2018 ఫిబ్రవరి 6న కలిశాం. నలుగురికి సమంగా పంచాల్సిన భూమిని ఒక్కడి పేరిటే ఎలా నమోదుచేశారని ప్రశ్నించాం. సంబంధిత ఆర్డీవోకు, జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశాం. వారూ తాసిల్దార్‌కే మా సమస్య పరిశీలనకు పంపించారు. తాసిల్దార్‌ను క్రమం తప్పకుండా కలుస్తూనే ఉన్నాం. సదరు ఎమ్మార్వో ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేం ఎన్నిసార్లు అడిగినా సప్పుడు చేస్తలేడు. మా నలుగురికి సమంగా చెందాల్సిన భూమి.. ఇలా ఒక్కడి పేరిటే పహాణీలో నమోదు చేయించడం వెనుక పదవీవిరమణ చెందిన ఒక ఎమ్మార్వో హస్తం ఉన్నదని తెలిసింది. ఆ రిటైర్డ్ ఎమ్మార్వో బామ్మర్ది స్థానిక వీఆర్వో అని.. ఆయనే సంజీవయ్యకు రిజిస్ట్రేషన్ చేయడంలో సహాయం చేశాడని తెలిసింది. పైగా, రిటైర్డ్ ఎమ్మార్వో, ప్రస్తుత ఎమ్మార్వోలు ఒకే గ్రామానికి చెందినవారని సమాచారం. అందుకే, ప్రస్తుత ఎమ్మార్వో మాకు సహకరించడం లేదు. పహాణీలో ప్రస్తుతం ఉన్న తమ్ముడి పేరు తొలిగించి, నలుగురు అన్నదమ్ముల పేర్లను నమోదుచేయాలని సంగారెడ్డి తాసిల్దార్‌ను నమస్తే తెలంగాణ ధర్మగంట ద్వారా కోరుతున్నాం.
- మాణిక్యం, సంగారెడ్డి

144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles