పట్టించుకోవడం లేదు


Mon,August 26, 2019 01:38 AM

farmer singineni sarakka requests passbook

నా తండ్రి బోద లచ్చయ్యకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాముత్తారం మండలంలోని మాధారం గ్రామంలో సర్వేనంబర్ 91/73లో 32 గుంటల భూమి, నా తమ్ముడు బోద సమ్మయ్యకు సర్వే నంబర్ 91/70లో ఎకరం 32 గుంటలు, 91/71లో 28 గుంటల భూమి ఉన్నది. మా నాన్న, తమ్ముడు కొన్నేండ్ల క్రితం చనిపోయారు. వారి పేరిట ఉన్న భూమిని నా పేరు మీదికి మార్పిడి చేయాలని విన్నవించుకున్నా స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. లాయర్ దగ్గరకు పోయి నోటరీ రాయించుకొని.. రెవెన్యూ అధికారికి ఇచ్చినప్పటికీ నా పేరుమీద పట్టా చేయడంలేదు.
- సింగినేని సారక్క, మాధారం, మహాముత్తారం మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా .


పంతకాని పోషయ్య

ప్రభుత్వ పథకాలకు దూరమయ్యా..

మా నాన్న పంతకాని అంకయ్య పేరు మీద జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాముత్తారం మండలంలోని మాధారం గ్రామంలో సర్వే నంబర్ 20లో 14 గుంటలు, 21లో గుంట, 46/1లో 1.27 ఎకరాలు, 91/119లో 9 గుంటలు, 91/277లో 11 గుంటలు, 164లో 21 గుంటలు 165లో 15 గుంటలు,166లో 22 గుంటల భూమి ఉన్నది. మా తండ్రి కొన్నేండ్ల కింద చనిపోయాడు. ఆయన పేరు మీద ఉన్న పట్టాను నా పేరు మీదికి మార్చాలని రెవెన్యూ అధికారులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. పలుమార్లు స్థానిక రెవెన్యూ అధికారిని కలిసినా పట్టించుకోవడం లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే రైతుబంధు, సబ్సిడీ ఎరువులు, రైతు బీమా పథకాలకు దూరమయ్యాం. ఉన్నతాధికారులు పట్టించుకొని నా పేరుమీద పట్టా అయ్యేలా చూడాలని చేతులెత్తి వేడుకుంటున్నా.
- పంతకాని పోషయ్య,మాధారం, మహాముత్తారం మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా .

778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles