వీఆర్వో నిర్లక్ష్యం..రైతుబీమాకు నోచుకోని దైన్యం


Wed,June 19, 2019 02:05 AM

Farmer dies of heart attack In Sriramagiri

-మహబూబాబాద్ జిల్లా శ్రీరామగిరిలో గుండెపోటుతో రైతు మృతి
నెల్లికుదురు: వీఆర్వో నిర్లక్ష్యం ఓ రైతు కుటుంబానికి శాపంగా మారింది. గుండెపోటుతో మృ తి చెందిన ఆ రైతు కుటుంబానికి రైతుబీమా పథకం కింద అందాల్సిన రూ.ఐదు లక్షల సా యం అందకుండాపోతున్నది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరికి చెందిన నిరుపేద రైతు గుండెపాక వెంకన్న (38) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉ న్నారు. ఆయనకు తన తాత ఆరెపల్లి సాయిలు ద్వారా సర్వే నంబర్ 332/బి/1లోని 26 గుంటల భూమి సంక్రమించింది. తన తాత మరణానంతరం ఈ భూమిని తన పేరిట మార్చాలంటూ 2017 భూరికార్డుల ప్రక్షాళన సమయంలో వెంకన్న రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిని పరిశీలించిన అప్పటి తాసిల్దార్.. విరాసత్‌కు అర్జిదారుడు అర్హుడేనని సర్టిఫైచేశారు. ఈ మేరకు రికార్డులను ఆన్‌లైన్ చేయాలని వీఆర్వోను ఆదేశించారు. కానీ వీఆర్వో సమ్మయ్య నిర్లక్ష్యంగా వ్యవహరించి.. ఇప్పటివరకూ ఆన్‌లైన్ చేయలేదు. దీంతో వెంకన్నకు పాస్‌పుస్తకం రాలేదు. రైతుబీమా వర్తించలేదు. రైతు వెంకన్న మృతివార్త తెలిసిన తాసిల్దార్ పున్నంచందర్ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. అప్పటి తాసిల్దార్ ఆదేశించినప్పటికీ, వెంకన్నకు సంబంధించిన రికార్డులను ఆన్‌లైన్ చేయకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీఆర్వో సమ్మయ్యపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపిస్తానని చెప్పారు.

1103
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles