నిన్న పట్టాదారు.. నేడు అనుభవదారు


Mon,August 26, 2019 01:43 AM

farmer bhadrappa family meets dharmaganta over revenue officers negligence

-రికార్డులు తారుమారుచేసిన రెవెన్యూ అధికారులు
-రైతు భూమి సహకార సంఘానికి అక్రమంగా పట్టా
-తప్పుడు పేపర్‌పై నకిలీ సాదాబైనామా
-ధర్మగంటను ఆశ్రయించిన మెదక్ జిల్లాకు చెందిన భద్రప్ప కుటుంబం

బతుకుదెరువు కోసం వలస వెళితే.. సొంతూరులో ఉన్న పట్టాభూమిలో సహకారసంఘం భవనం వెలిసింది. ఇదేమని రెవెన్యూ అధికారులను అడిగితే.. నిన్నటివరకు పట్టాదారు కాలమ్‌లోఉన్న రైతుపేరును అనుభవదారు కాలమ్‌లోకి మార్చేశారు. పట్టాదారుడు 1972లోనే ఆ భూమిని అమ్మివేశారంటూ ఆ సమయంలో అందుబాటులోనే లేని ఏ4 సైజ్ పేపర్‌తో నకిలీపత్రాలు సృష్టించారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్న స్థలాన్ని సర్వేచేయాలంటూ ఆర్డీవో ఇచ్చిన ఆదేశాలనూ తాసిల్దార్ పట్టించుకోవడం లేదని పేర్కొంటూ.. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగసాయిపేటకు చెందిన బాధితులు ప్రసాద్, నవీన్, వివేక్ ధర్మగంటను ఆశ్రయించారు.

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటకు చెందిన జంగం భద్రప్ప కుటుంబం బతుకుదెరువు కోసం 30 ఏండ్ల క్రితం హైదరాబాద్‌కు వలసవెళ్లింది. ఆయనకు రంగంపేట ప్రధానరహదారికి అనుకుని సర్వే నంబర్ 297లో 13 గుంటల భూమి ఉన్నది. 2019 వరకు ఆయనే పట్టాదారుగా ఆన్‌లైన్ రికార్డులు ఉన్నాయి. జంగం భద్రప్ప 1990 ఆగస్టులో మరణించారు. భద్రప్ప కుమారుడు జంగం వీరప్ప తన పేరున ఫౌతీ చేయాలని కొల్చారం తాసిల్దార్ సహదేవ్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే ఆ భూమి రంగంపేట విశాల సహకార సం ఘం పట్టాదారుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నది. 2019 జూలై వరకు తమ తండ్రి భద్రప్ప పేరు మీదనే భూమి ఉన్నదని.. ఇప్పుడు విశాల సహకారసంఘం పేరు ఎలా వస్తుందని వీరప్ప ప్రశ్నిస్తున్నారు. భద్రప్ప 1972లో 13 గుం టల భూమిని విశాల సహకారసంఘానికి అమ్మినట్టు రికార్డులు చూపుతున్నారని.. కానీ, అప్పట్లో అందుబాటులో లేని A4 సైజు పేపర్‌పై తమ తాత ఎలా సంతకం చేశారో అర్థం కావడం లేదని భద్రప్ప మనుమలు ప్రసాద్, నవీన్, వివేక్ నమస్తే తెలంగాణకు తెలిపారు.

farmer-veerappa2

2019 జూలై వరకు భద్రప్ప పేరుమీదనే..

ఈ ఏడాది జూలై వరకు 297 సర్వే నంబర్‌లోని 13 గుంటల భూమికి పట్టాదారుగా రైతు భద్రప్ప పేరే నమోదై ఉన్నది. ఇందుకు సంబంధించిన ఈసీని కూడా బాధిత కుటుంబసభ్యులు చూపిస్తున్నారు. జూలై తరువాత పట్టాదారుగా ఉన్న రైతు భద్రప్ప పేరును అనుభవదారుగా రికార్డుల్లో మార్చారని.. పట్టాదారు కాలమ్‌లో రంగంపేట విశాల సహకారసంఘంను చేర్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవోకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. రికార్డులు పరిశీలించి న్యాయం చేయాలంటూ నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి.. కొల్చారం తాసిల్దార్‌కు ఆదేశాలిచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. వీఆర్వో భిక్షపతి, గతంలో పనిచేసిన తాసిల్దార్ రమేశ్.. సహకారసంఘంతో కుమ్మ క్కై రికార్డులు మార్చారని బాధిత కుటుంబం ఆరోపిస్తున్నది.

farmer-veerappa3

మా పెద్దల గోరీలు ఇక్కడే ఉన్నాయి

297 సర్వే నంబర్‌లోని 0.13 గుంటల భూమి తమదేనని, ఇక్కడ తమ పెద్దల గోరీలు కూడా ఉన్నాయని భద్రప్ప కుమారుడు జంగం వీరప్ప ఆయన భార్య సుగుణ తెలిపారు. అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని, తమభూమి ఇప్పించాలని వేడుకుంటున్నారు. పొట్టచేత పట్టుకుని వలసవెళితే.. ఉన్న భూమి రెవెన్యూ అధికారులు, సహకార సంఘం అధికారులు కుమ్మక్కై రికార్డులను మార్చారని పేర్కొన్నారు.


జిల్లా జాయింట్ కలెక్టర్ నగేశ్

ఫిర్యాదు అందింది.. విచారిస్తాం

297 సర్వేనంబర్‌లోని భూ మిలో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నట్టు తమ కు ఫిర్యాదు అందిందని.. విచారణ జరిపిస్తానని జిల్లా జాయింట్ కలెక్టర్ నగేశ్ తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం 2019 వరకు రైతు పేరుపై పట్టాఉంటే నర్సాపూర్ ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాలని రైతుకు పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పారు. రికార్డుల మార్పుపై విచారణ జరుపుతామన్నారు.
-జిల్లా జాయింట్ కలెక్టర్ నగేశ్నవీన్, విశాల సహకార సంఘం సీఈవో

1972లో కొనుగోలు చేసినట్టు పత్రాలున్నాయి

1972లో 0.13 గుంటల భూమి విశాల సహకార సం ఘం కొనుగోలుచేసినట్టు పత్రాలు ఉన్నాయి. ఇప్పటివరకు రైతు భద్రప్పనే పట్టాదారుగా ఉన్నప్పటికీ.. 1979 నుంచి కాస్తుకాలంలో విశాల సహకార సంఘం పేరే ఉన్నది. సహకారం సంఘానికి సంబంధించి 4.21 ఎకరాల భూమి ఉన్నది. రికార్డుల మార్పులవిషయంలో మాకెలాంటి సం బంధంలేదు.
- నవీన్, విశాల సహకార సంఘం సీఈవోసహకారం సంఘం అర్జీపెట్టుకున్నది

1972లో సర్వేనంబర్ 297లో విస్తీర్ణం 0.13 గుంటలను తెల్లకాగితంపై రాసుకుని కొనుగోలు చేసినట్టు సహకారసంఘం ఆర్జీ పెట్టుకున్నారు. మోఖాపైకి వెళ్లి విచారణచేయాలని వీఆర్వో, ఆర్‌ఐను ఆదేశించాం. వారి నివేదిక ప్రకారం రికార్డుల నుంచి పట్టాదారుకాలంలోభద్రప్ప పేరు తొలగించి విశాల సహకారసంఘం పేరు ఎక్కించాం. ఏమైనా అభ్యంతాలు ఉంటే ఆర్డీవోకు అప్పీలు చేసుకోవాలి.
-సహదేవ్, తాసిల్దార్,కొల్చారం

1034
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles