రికార్డులు సరిచేయడంలేదు

Wed,September 11, 2019 02:33 AM

-సర్వే నంబర్‌తో సంబంధంలేని వ్యక్తికి పాస్‌పుస్తకం జారీ
-ధర్మగంటను ఆశ్రయించిన ఖమ్మం జిల్లా చింతగుర్తి రైతు

రఘునాథపాలెం: ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు రికార్డులు చేయడంలో ఘనాపాటి లైన రెవెన్యూ అధికారులు తప్పును సరిదిద్దడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చింతగుర్తికి చెందిన రైతు ఆలస్యం శ్రీనివాసరావుకు సర్వే నంబర్ 40లో 1.20 ఎకరాల భూమి వారసత్వంగా సంక్రమించింది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా తనకు పాస్‌బుక్ ఇవ్వాలని శ్రీనివాసరావు రెండేండ్ల కింద రఘునాథపాలెం తాసిల్ కార్యాలయంలో మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకొన్నారు. పరిశీలించిన అధికారులు శ్రీనివాసరావు దరఖాస్తు చేసుకొన్న సర్వే నంబర్‌లో భూమి లేదని చెప్పారు.

తీరా జరిగిన తప్పిదాన్ని బాధిత రైతు తెలుసుకొనే ప్రయత్నం చేయగా సర్వే నంబర్ 40తో సంబంధంలేని ఓ రైతుకు పాస్‌బుక్ జారీచేశారు. తాను హక్కుదారుడినైనప్పటికీ పాస్‌బుక్ ఇవ్వలేదని శ్రీనివాసరావు వాపోయారు. సర్వే నంబర్ 56కు చెందిన ఓ రైతును సర్వే నంబర్ 40లో చేర్చారని, ఈ విషయం తెలిసినప్పటికీ రెవెన్యూ అధికారులు సరిదిద్దడంలో జాప్యంచేస్తున్నారని వాపోయారు. గ్రామానికి చెందిన ఓ రైతుకు అసలు భూమి లేకపోయినప్పటికీ సర్వే నంబర్ 49లో 2.30 ఎకరాలకు పాస్‌పుస్తకం ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయంచేయాలని శ్రీనివాసరావు వేడుకొంటున్నారు.

96
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles