పట్టా చేయలేదని ఆత్మహత్యాయత్నం


Wed,June 12, 2019 02:11 AM

Farmer A suicide attempt was not Land Registration

-నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఘటన
-రైతుకు న్యాయంచేస్తామన్న రెవెన్యూ అధికారులు

అమ్రాబాద్ రూరల్: భూమి పట్టా చేయడంలేదని నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తెలుగుపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకటయ్య మంగళవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంకటయ్య కిరోసిన్ పోసుకోగా, గమనించిన రెవెన్యూ అధికారులు అడ్డుకొని, న్యాయం చేస్తామని చెప్పారు. తన తండ్రికి చెందిన నాలుగెకరాల భూమి పట్టా కావాల్సి ఉండగా ముగ్గు రు అన్నదమ్ములకు మూడెకరాలు పట్టా చేశారని, మిగిలిన ఎకరా తనపేరున విరాసత్ చేయాల్సి ఉన్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని వెంకటయ్య తెలిపాడు. దీనిపై డిప్యూటీ తాసిల్దార్ లక్ష్మీదేవిని వివరణ కోరగా గ్రామానికి చెందిన ఇద్దరి పేర్లు ఒకేలా ఉండటంతో ఆన్‌లైన్‌చేయడానికి సాంకేతిక లోపం ఏర్పడిందని, దానిని సరిచేసి రైతు పేర పట్టాచేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మీ సేవలో కేవైసీని పూర్తిచేయించినట్టు తెలిపారు.

239
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles