ఫ్యాన్సీ నంబర్ కోసం ఫైట్!


Tue,April 16, 2019 01:11 AM

Fancy Numbers Rs 3055 lakh in revenue

-నంబర్ 1 కోసం రక్తాలు కారేలా కొట్టుకున్న కోటీశ్వరులు
-విస్తుపోయిన రవాణాశాఖాధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వారు కోటీశ్వరులు, కోట్లు పోసి ఖరీదైన విలాసవంతమైన కార్లు కొన్నారు. ఫ్యాన్సీ నంబర్ 1 కోసం రక్తంకారేలా కొట్టుకున్నారు. ఈ ఘటన సాక్షాత్తు రవాణాశాఖ కేంద్ర కార్యాలయం ఆవరణలోని ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ ఘటనను చూసిన రవాణాశాఖాధికారులు, సిబ్బంది విస్తుపోయారు. ఆర్టీవో దుర్గాప్రసాద్ సాక్షిగా ఆయన చాంబర్లో ఈ వ్యవహారం జరిగింది. టీఎస్ 09 ఎఫ్‌ఎఫ్ 0001 నంబర్ కోసం ఎఫ్‌ఆర్‌ఆర్‌ఎన్ హిల్ హోటల్స్ ప్రైవేటు లిమిటెడ్‌తోపాటు సుచిరిండియా సంస్థ పోటీపడింది. ఫ్యాన్సీ నంబర్ల వేలంలో డీడీ డిపాజిట్ సమయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగి కొట్టుకున్నారు. ఆరుగురు నంబర్ 1 కో సం పోటీపడగా గొడవల మధ్యనే హిల్ హోట ల్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ.6,95,000కు ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకుంది.

ఫాన్సీ నంబర్లకు రూ.30.55 లక్షల ఆదాయం
వాహనాల ఫ్యాన్సీ నంబర్లపై సోమవారం ఒక్కరోజే రూ.30,55,748 ఆదాయం వచ్చిందని జేటీసీ పాండురంగనాయక్ చెప్పారు. రూ.1,63,67,000 విలువైన టయోటా ల్యాండ్ క్రూయిజర్ కోసం టీఎస్ 09 ఎఫ్‌ఈ 9999 నంబరుకు రూ.10 లక్షలను ఎన్‌ఎస్‌ఎల్ ప్రాపర్టీస్ చెల్లించిందని, గొడవకు కారణమైన టీఎస్ 09 ఎఫ్‌ఎఫ్ 0001 నంబర్‌ను రూ.2,65,50,600 విలువైన లెక్సస్ ఎల్‌ఎక్స్ 570 మోడల్ కారు కోసం హిల్‌హోటల్స్ ప్రై.లి. 6,95,000కు దక్కించుకుంది. ఆడిక్యూ 5 మోడల్ కోసం టీఎస్ 09 ఎఫ్‌ఎఫ్ 0099 నంబరు కోసం ఎమర్జిన్ అగ్రినోవో ప్రై.లి. 2,78,000 చెల్లించిందని జేటీసీ తెలిపారు.

106
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles