నకిలీ బంగారం పట్టివేత


Thu,April 18, 2019 01:56 AM

Fake Gold seized In Suryapet district

-24.4 కిలోల ఇత్తడి, రాగి మిశ్రమ ముద్దలుగా గుర్తింపు
-క్షుద్రపూజలంటూ స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి..
-సూర్యాపేట జిల్లా అమరవరంలో కలకలం

హుజూర్‌నగర్, నమస్తే తెలంగాణ: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలో నకిలీ బంగారం పట్టివేత కలకలం సృష్టించింది. ఇత్తడి, రాగి మిశ్రమంతో ముద్దలుగా తయారుచేసిన 24.4 కిలోల నకిలీ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో బం గారు నిధి ఉన్నదని అమరవరం గ్రామంలోని సింగితల గుర్వారెడ్డి అనే వ్యక్తి.. క్షుద్రపూజలు చేస్తున్నారని, నల్లమేకలను బలిచ్చి గ్రామం అవతల పడవేస్తున్నారని గ్రామస్థుల ఫిర్యాదు చేశారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, సీఐ భాస్కర్.. నిందితుల ఇంట్లో తనిఖీలు చేశారు. ఇంటికి ఒక మూలన గుంతను తవ్వి, దానిలో పసుపు, కుంకుమ చల్లిఉన్నట్టు గుర్తించారు. అటక మీద ఉన్న సంచిలో ముద్దలుగా ఉన్న నకిలీ బంగారు నాణేలు కనిపించాయి. గుర్వారెడ్డి, అతని కుమారుడు వీరారెడ్డిని పోలీసులు ప్రశ్నించారు.

ఇంట్లో గుప్త నిధులు ఉన్నట్టు నిద్రలో కల వచ్చిందని, తవ్విచూస్తే బంగారం దొరికిందని నిందితులు తెలిపారు. వెంటనే పోలీసులు తవ్విన గుంతను మరింత తవ్వి చూడగా ఏమీ కనిపించలేదు. నాణేలతోపాటు గుర్వారెడ్డి, వీరారెడ్డిని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొంతమంది సమక్షంలో బంగా రం అసలా.? నకిలీదా? తెలుసుకొనేందుకు పరీక్షలు చేయించారు. అది ఇత్తడి, రాగితో చేసిన మిశ్రమ పదార్థమని పరీక్షలో తేలినట్టు తెలిసింది. రెవెన్యూ అధికారులను పిలిపించి అర్ధరాత్రి పంచనామా నిర్వహించి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబంలో అం దరి ఆరోగ్యాలను బాగుచేస్తానని భద్రాచలం జిల్లా నుంచి వచ్చిన ఒక వ్యక్తి తమ వద్ద నుంచి రూ.2 లక్షలను వసూలు చేశాడని బుధవారం గుర్వారెడ్డి పోలీసులకు తెలిపారు. రూ.20 వేల చొప్పున పలుమార్లు ఇచ్చామని, ప్రతీసారి ఆ వ్యక్తి బంగారు నాణేలంటూ ఈ బిల్లలను ఇచ్చాడని గుర్వారెడ్డి చెప్పినట్టు ఏఎస్‌ఐ ఆనంద్‌నాయక్ తెలిపారు.

అర్ధరాత్రి హడావుడి

మంగళవారం అర్ధరాత్రి సమయంలో హడావుడిగా పంచనామా చేయడంపై అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 25 కిలోల బంగారంగా సందేహం ఉన్నప్పుడు రెవెన్యూ ఉన్నతాధికారులు లేకుండా పంచనామా ఎందుకు నిర్వహించారు? అలా చేయొచ్చా అనేది ప్రశ్నగా మిగిలింది. క్షుద్రపూజలు చేసేందుకు వచ్చిన వ్యక్తి వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని నకిలీ నాణేలను ఇచ్చాడా? మోసగాడు ఎక్కడనుంచి వచ్చా డు? తదితర విషయాలు విచారణలో బయటపడనున్నాయి.

1658
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles