లాసెట్ దరఖాస్తు గడువు 25 వరకు పొడిగింపు


Tue,April 16, 2019 12:53 AM

Extension of lacet application upto 25

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని లా కాలేజీల్లో సీట్ల భర్తీకి మే 20న జరిగే లాసెట్, పీజీ లాసెట్-2019 దరఖాస్తులకు ఈ నెల 25 వరకు గడువు పొడిగించారు. సోమవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఆధ్వర్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీరెడ్డి తెలిపారు. తొలుత ప్రకటించిన ప్రకారం ఈ నెల 15వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. తాజా నిర్ణయంతో ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా 25 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని జీబీరెడ్డి పేర్కొన్నారు.

79
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles