పౌరసరఫరాలశాఖా.. సుఖీభవా!


Wed,December 20, 2017 02:23 AM

Excellent dinner arrangements were arranged says cv anand

52,500 మందికి భోజనాలు.. 5వేదికలు.. 40రకాల వంటకాలు
CV-anand
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రపంచ తెలుగు మహాసభల్లో నాలుగు రోజులపాటు దాదాపు 52,500 మందికి చక్కటి విందు భోజనాలు ఏర్పాటుచేసిన పౌరసరఫరాలశాఖ శెభాష్ అనిపించుకొన్నది. సమిష్టి కృషి, పక్కా ప్రణాళికతో ఒక్క విమర్శ కూడా రాకుండా అతిథులకు నోరూరించేలా పసందైన వంటకాలు వండి వడ్డించింది. అన్నదాత సుఖీభవ అనే దీవెనలను పొందింది. ప్రతిరోజూ 10 వేలమందికి భోజనాలు ఏర్పాట్లుచేయాలని తొలుత భావించారు. కానీ ప్రతిరోజూ సగటున 13 వేలమందికి భోజనాలు వడ్డించారు. ఒక్కరిని కూడా తిప్పి పంపకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు వడ్డించటం విశేషం. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు భోజనాలు పెట్టారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం వద్ద సెంట్రల్‌కిచెన్ ఏర్పాటుచేసి మిగతా నాలుగు వేదికల వద్దకు భోజనాలు సరఫరాచేశారు. ప్రతిరోజూ వేర్వేరు రుచులతో 40 రకాల వంటలను 5 వేదికల వద్ద వడ్డించారు. శాఖాహార భోజనంతోపాటు పిండివంటలు, తీపి పదార్థాలు, ఫ్రూట్‌సలాడ్ అందించారు. పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్ సీవీ ఆనంద్ ప్రతిరోజూ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
feast

అతిథి దేవోభవ.. అదే మాకు స్ఫూర్తి..!

ఏ కార్యక్రమంలో అయినా మాట వచ్చేది భోజనాల దగ్గరే. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకొని నెలరోజుల నుంచి సమిష్టి కృషిచేశాం. తెలంగాణ కవులు, రచయితలు ఇక్కడి సాహిత్యాన్ని ప్రపంచానికి చాటారు. మా వంతుగా మేము తెలంగాణ రుచులను ప్రపంచ తెలుగు ప్రతినిధులకు చూపించాం. సీఎం కేసీఆర్, సీఎస్ ఎస్పీసింగ్, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రతిరోజూ భోజన ఏర్పాట్లపై సమీక్షించారు. వంటచేసినవారు, పౌరసరఫరాలశాఖ అధికారులు, పోలీసులు అందరం కలిసి కృషిచేశాం. ఇంతమందికి సంతృప్తికరంగా భోజనాలు అందించామని గర్వంగా ఉన్నది. అతిథి దేవోభవ.. అదే మాకు స్ఫూర్తి..!
-సీవీ ఆనంద్, పౌరసరఫరాలశాఖ కమిషనర్

1535
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles