పీఈటీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన 14న

Sat,November 9, 2019 01:19 AM

-తేదీలు ఖరారు చేసిన టీఎస్‌పీఎస్సీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పలు పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనంతరం 1:3 నిష్పత్తిలో ఎంపికైన 71 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ- తెలుగు) అభ్యర్థులకు ఈ నెల 14న ఉదయం 10:30 గంటలకు నాంపల్లిలోని ప్రతిభాభవన్‌లో ధ్రువపత్రాలను పరీశీలించనున్నట్టు పేర్కొన్నది.

బిల్‌కలెక్టర్ అభ్యర్థులకు, ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్లకు 15న..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప రిధిలో బిల్‌కలెక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు, ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 15 ఉద యం 10 గంటలకు నాంపల్లిలోని ప్రతిభాభవన్‌లో ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు.

బేవరేజెస్ కార్పొరేషన్‌లో ఎంపికైన అభ్యర్థులకు..

తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌లోని అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-2, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్-2, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు 15న ప్రతిభాభవన్‌లో నిర్వహించే ధ్రువపత్రాలకు హాజరు కావాలని సూచించింది.

మిగిలిన గ్రూప్-2 పోస్టులకు 18న..

మిగిలిన గ్రూప్-2 పోస్టులను భర్తీచేసేందుకు నాంపల్లిలోని ప్రతిభాభవన్‌లో 18న ఉదయం 10.30 గంటలకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. అర్హతగల అభ్యర్థులు లేకపోవడంతో ఆర్థికశాఖలో 1, న్యాయశాఖలో 3 పోస్టులు మిగిలిన విషయం తెలిసిందే. ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పూర్తివివరాలు తెలుసుకొనేందుకు తమ వెబ్‌సైట్‌ను చూడాలని టీఎస్‌పీఎస్సీ కోరింది.

83
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles