ఎక్స్‌షోరూం ధర వివాదానికి తెర

Thu,December 5, 2019 01:21 AM

-వాహన లైఫ్‌ట్యాక్స్ వసూలు బాధ్యత డీలర్లదే
-హైకోర్టు ఆదేశాలతో ఉత్తర్వులు జారీచేసిన రవాణాశాఖ

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తలనొప్పిగా మారిన వాహన ఎక్స్‌షోరూం ధర వివాదానికి రవాణాశాఖ చెక్‌పెట్టింది. లైఫ్‌ట్యాక్స్ వసూళ్లలో ఏర్పడుతున్న వివాదాలు రవాణాశాఖ అధికారులకు ఇబ్బందిగా మారా యి. వాహన డీలర్లే బాధ్యత వహించాలం టూ ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఇకపై డీలర్లే వినియోగదారుల నుంచి వాహన లైఫ్‌ట్యాక్స్ వసూలుచేయాలని రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీచేశారు. లైఫ్‌ట్యాక్స్ విషయంలో తరచూ డీలర్లుచేస్తున్న మోసం వల్ల రవాణాశాఖ అధికారులు బద్నాం అవుతున్నారు. ఎక్స్‌షోరూం ధర, ఆఫర్ల పేరుతో వినియోగదారులకు వాహన విలువను తగ్గించినట్టు చెప్తూ తక్కువ డబ్బు లు తీసుకొనేవారు.

దీనివల్ల వాహనం అసలు ధరకు తేడా వస్తున్నది. అసలు ధర ప్రకారం పన్ను చెల్లించాలని అధికారులు వాహనదారులపై ఒత్తిడి తేవడంతోపాటు ప్రభుత్వానికి రావాల్సిన పన్ను చెల్లించకుంటే రిజిస్ట్రేషన్ వీలుకాదంటుండటంతో యజమానులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గతంలో ఈ వివాదంలో కొంతమంది రవాణాశాఖ అధికారులు ఇరుక్కొని ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని గతంలో ఇన్వాయిస్ ప్రకారం పన్ను వసూలుచేయాలని ఆదేశించినప్పటికీ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. కొద్ది రోజుల క్రితం హైకోర్టు.. ఇన్వాయిస్ ఆధారంగా లైఫ్‌ట్యాక్స్ వసూలు చేయాలని ఆదేశాలు జారీచేసింది.

211
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles