ఏవోసీలో రేపు మాజీ సైనికుల ర్యాలీ


Thu,September 12, 2019 02:28 AM

Ex servicemen rally to be held tomorrow

-పింఛన్‌సహా సమస్యల పరిష్కారానికి చర్యలు
హైదరాబాద్/ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మాజీ సైనికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందుతున్న పథకాలు, రాయితీలు, వారి సమస్యల పరిష్కారానికి మాజీ సైనికులతో ర్యాలీని నిర్వహిస్తున్నట్టు ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి నోరి శ్రీనేశ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏవోసీ సెంటర్‌లోని ఆర్డినెన్స్ హాల్లో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి ఈ ర్యాలీ జరుగుతుందని చెప్పారు. మాజీ సైనికులు, వారి కుటుంబసభ్యుల సౌకర్యార్థం వివిధ కార్యాలయాలవారు స్టాల్స్‌ను ఏర్పాటుచేసి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా వీరనారీమణులను, ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రత్యేకంగా సన్మానించి, బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు.

174
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles