మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తియాదవ్ కన్నుమూత

Sun,October 13, 2019 02:12 AM

మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తాసహా పలువురి నివాళి
త్రిపురారం: నాగార్జునసాగర్ (చలకూర్తి) మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నేత గుండెబోయిన రామ్మూర్తియాదవ్ (72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ దవాఖానలో చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. భౌతికకాయాన్ని ఆయన స్వస్థలమైన నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లికి తీసుకురాగా.. పెద్దఎత్తున రాజకీయ ప్రముఖులు తరలివచ్చి నివాళులర్పించారు. ఆదివారం ఉద యం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.


ramamurthy-yadav3
1994-99 మధ్య చలకూర్తి ఎమ్మెల్యేగా రా మ్మూర్తియాదవ్ పనిచేశారు. 1947 అక్టోబర్ 26న జన్మించిన ఆయనకు ఇద్దరు కుమారు లు, ఆరుగురు కూతుళ్లు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో రామ్మూర్తియాదవ్ టీడీపీ నుంచి బరిలోకి దిగి జానారెడ్డిపై గెలుపొందారు. 2014లో కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌కు రామ్మూర్తియాదవ్ స్వయాన మేనమామ.

ramamurthy-yadav2

ప్రముఖుల నివాళి

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు బడుగుల, బండా, వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే నోముల, జెడ్పీచైర్మ న్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి తదితరులు పెద్దదేవులపల్లిలో రామ్మూర్తియాదవ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

1095
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles