వ్యవసాయ శాస్త్రవేత్త గోపాల్‌రెడ్డి కన్నుమూత


Sun,April 15, 2018 02:37 AM

Ex-Minister Rajagopala Reddy passes away

-గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సృష్టికర్త
-ఎత్తిపోతల పథకాలకు ఆద్యుడు
-గోపాల్‌రెడ్డి మృతికి మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం

Jagadish-Reddy
హైదరాబాద్/గరిడేపల్లి, నమస్తే తెలంగాణ: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, గడ్డిపల్లి కేవీకే వ్యవస్థాపకుడు, ఎత్తిపోతల పథకం రూపకర్త డాక్టర్ ఘంటా గోపాల్‌రెడ్డి (88) కన్నుమూశారు. గోపాల్‌రెడ్డి కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో శనివారం తుదిశ్వాస విడిచారు. సాయంత్రం స్వగ్రామంలోనే గోపాల్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెళ్లి గోపాల్‌రెడ్డి సమాధికి పుష్పాంజలి ఘటించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. గోపాల్‌రెడ్డికి భార్య రత్నమాల, ఇద్దరు కుమార్తెలు లక్ష్మి, మీరా, కుమారుడు అజిత్‌రెడ్డి ఉన్నారు. 1932 ఫిబ్రవరి 14న నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో జన్మించిన గోపాల్‌రెడ్డి.. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో 1948-52 వరకు వ్యవసాయ విద్యనభ్యసించారు. అనంతరం నల్లగొండలో వ్యవసాయ విస్తరణాధికారిగా కొంతకాలం సేవలందించారు. 1958లో అమెరికాకు వెళ్లిన గోపాల్‌రెడ్డి 1960-64 వరకు అగ్రికల్చర్ పీజీ పూర్తిచేసి, 1969లో పీహెచ్‌డీ పూర్తిచేశారు. స్వదేశం తిరిగి వచ్చి ఏపీలో 1969లో మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటుచేసి రైతుల బీడు భూముల్లో పంట సిరులు కురిపించారు. శ్రీమాతృకృపా గడ్డిపల్లి అభ్యుదయం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 1984-85లో గడ్డిపల్లిలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని నెలకొల్పారు.

రైతుబాంధవుని మృతి తీరనిలోటు: మంత్రి జగదీశ్‌రెడ్డి

రైతు బాంధవుడు, నిస్వార్థపరుడు గోపాల్‌రెడ్డి మృతి తీరనిలోటని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గడ్డిపల్లిలో గోపాల్‌రెడ్డి సమా ధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గోపాల్‌రెడ్డి నిరంతరం రైతుల శ్రేయస్సుకోసం ఆలోచించేవారన్నారు. ఆయన మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. గడ్డిపల్లిలో మోడల్ స్కూల్, ప్రభుత్వ పాఠశాలతోపాటు బ్యాం కులు, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో గోపాల్‌రెడ్డి కీలక భూమిక పోషించారని అన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ సైతం సమాధి వద్ద నివాళులు అర్పించారు. వీరి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కాసోజు శంకరమ్మ, అంకిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ శానంపూడి సైదిరెడ్డి, కేవీకే సెక్రటరీ ఘంటా సత్యనారాయణరెడ్డి, శాస్త్రవేత్తలు తదితరులు ఉన్నారు.

1115
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS