పాఠశాలల్లో ప్రతిరోజూ స్వచ్ఛ కార్యక్రమం

Sat,September 14, 2019 12:45 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని అన్నిపాఠశాలల్లో ప్రతిరోజూ స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులకు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాలకు సంబంధించి శుక్రవారం టీ-సాట్ ద్వారా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కార్యక్రమాలలో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. పాఠశాలల్లో స్వచ్ఛక్లబ్‌లు ఏర్పాటుచేయడంతోపాటు ప్రతివిద్యార్థి ఒక స్వచ్ఛదూతగా పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్‌కుమార్, ఐటీసీ సీనియర్ మేనేజర్ ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

168
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles