ప్రతి రైతుకూ న్యాయం చేస్తాం


Wed,June 12, 2019 02:10 AM

Every farmer who suffers from wrongdoing in the records will get justice

-నల్లగొండ జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్
-ఒక ఊరు వంద తప్పులు కథనానికి స్పందన

దేవరకొండ, నమస్తే తెలంగాణ: రికార్డుల్లో తప్పుల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రతి రైతుకూ న్యాయంచేస్తామని నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. మంగళవారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన ఒక ఊరు వంద తప్పులు కథనానికి జేసీ స్పందించారు. గొట్టిముక్కల సర్పంచ్ కడారి అయ్యన్నతోపాటు రైతులతో దేవరకొండ తాసిల్దార్ కార్యాలయంలో మాట్లాడి గ్రామంలో నెలకొన్న భూ సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వారంరోజుల్లో గ్రామంలో ఉన్న భూ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారంపై వీఆర్వోలతో ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకొని వెనుకబడ్డ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామని చెప్పారు. గొట్టిముక్కల గ్రామంలో తక్షణమే సమస్యలను పరిష్కరించేదిశగా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ధరణి పూర్తయిన గ్రామాలకు చెందిన వీఆర్వోలను గొట్టిముక్కల భూ సమస్యలకోసం ప్రత్యేకంగా నియమిస్తామన్నారు. తాసిల్దార్ రామకృష్ణ మాట్లాడుతూ జేసీ ఆదేశాలమేరకు ముగ్గురు ఆపరేటర్లను గొట్టిముక్కల గ్రామంలోనే ఉంచి రికార్డులను పూర్తిగా పరిశీలనచేయించి భూసమస్యలను కొలిక్కితెస్తామని పేర్కొన్నారు. గ్రామంలో భూ సమస్యల పరిష్కారానికి చొరువ చూపడంపై రైతులు నమస్తే తెలంగాణకు కృతజ్ఞతలు తెలిపారు.

244
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles