ప్రభుత్వ దవాఖానలను పరిశీలించిన మంత్రి ఈటల


Wed,June 12, 2019 02:28 AM

Etela on a whirlwind tour of hospitals in Hyderabad

నిలోఫర్, ఉస్మానియా, గాంధీలో అభివృద్ధి పనులపై చర్చ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ దవాఖానల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఈటల రాజేందర్ నగరంలోని ప్రధాన దవాఖానలను మంగళవారం పరిశీలించారు. రోజంతా ఆయా దవాఖానలను పరిశీలించి, రోగులకు విస్తృత సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్యాధికారులతో చర్చించారు. మంత్రి ఈటల నిలోఫర్, ఉస్మానియా, గాంధీ దవాఖానలను సందర్శించి అన్ని విభాగాలను కలియతిరిగారు. ఆయా దవాఖానాల్లో విస్తరించాల్సిన వైద్య విభాగాలపై చర్చించారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా పడకల సామర్థ్యం పెంపు, ఆధునిక సౌకర్యాల కల్పన, భవనాల ఆధునీకరణ వంటి అంశాలపై వైద్యాధికారులతో మంత్రి విస్తృతంగా చర్చించారు.

ముందుగా నిలోఫర్ దవఖానలో చిన్నారులకు, బాలింతలకు అందుతున్న వైద్యసేవలు, భోజన వసతి, దవఖానాలోని సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఉస్మానియా దవాఖానలోని పాత భవనం, నర్సింగ్ స్కూల్, ఓపీ బ్లాక్‌ను, దోభీఘాట్ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలాలను మంత్రి పరిశీలించారు. అనంతరం అక్కడి వైద్యాధికారులతో సమావేశమయ్యారు. మంత్రి వెంట డీఎంఈ రమేశ్‌రెడ్డి, ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేందర్ ఉన్నారు. గాంధీ దవాఖానలోని వివిధ విభాగాలను మంత్రి పరిశీలించారు.

103
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles