రాష్ట్ర భద్రతా కమిషన్‌ను ఏర్పాటుచేయండి

Thu,December 5, 2019 01:15 AM

-హోంశాఖ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర భద్రతా కమిషన్, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో పోలీసు ఫిర్యాదుల అథారిటీలను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. గతంలోనే వీటి ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చినా అమలుకాకపోవడంపై సూమోటోగా స్వీకరించిన హైకోర్టు.. పై రెండు సంస్థలను ఈ నెల 27లోగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆలోపు నియమించకపోతే ఈ నెల 30వ తేదీన హోంశాఖ ముఖ్యకార్యదర్శి వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరుకావాలని స్పష్టంచేసింది. హెచ్చార్సీ చైర్మన్, సభ్యులు, లోకాయుక్త, ఉపలోకాయుక్త నియామకాలు కూడా చేపట్టలేదని విచారణ సందర్భంగా పేర్కొన్నది.

82
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles