కొండా లక్ష్మణ్ బాపూజీ మార్గం అనుసరణీయం

Mon,November 11, 2019 01:18 AM

-మంత్రి ఎర్రబెల్లి
తొర్రూరు, నమస్తే తెలంగాణ: తెలంగాణ పోరాటంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటం గొప్పదనీ, బాపూజీ మార్గం అనుసరణీయమని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పట్టణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాపూజీ విగ్రహాన్ని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎంపీ గుండు సుధారాణితో కలిసి మంత్రి ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశం లో మంత్రి మాట్లాడారు. లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో మలి దశ ఉద్యమంలో సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ కలను సాకారం చేశారన్నారు. మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

65
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles