కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తే ప్రజలు బుద్ధిచెప్తారు


Thu,June 20, 2019 02:24 AM

Errabelli Dayakar Rao Fires On Congress party Leaders Over Kaleshwaram Project

-ప్రాజెక్టును ఆపేందుకు కాంగ్రెస్ నేతలు స్టేలు తెచ్చారు
-అడ్డంకులొచ్చినా సీఎం కేసీఆర్ మూడేండ్లలోనే పూర్తిచేశారు
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్లితే బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు అబద్ధపు మాటలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. బుధవారం శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ ప్రాజెక్టును నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీకి 40 ఏండ్లు పట్టిందని, ఆ పార్టీ హయాంలో వరంగల్, నల్లగొండ జిల్లాలు నీళ్లు లేక బీళ్లుగా మారే పరిస్థితి ఉన్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ మూడేండ్లలోనే పూర్తిచేసి రికార్డు సృష్టించారని తెలిపారు. ప్రాజెక్టును ఆపేందుకు కాంగ్రెస్ నాయకులు కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకొచ్చారని మండిపడ్డారు. 95 శాతం మంది రైతులను ఒప్పించి ప్రభుత్వం భూములు సేకరిస్తే.. ఐదుశాతం రైతులతో ఆ పార్టీ నాయకులు కోర్టులకు వెళ్లారని అన్నారు. వారికి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం చెక్‌డ్యాంలు, ప్రాజెక్టులు కడుతుంటే అనేక ఆందోళనలు చేశామని.. ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించామని, కానీ కాంగ్రెస్ నాయకులు వాటి గురించే పట్టించుకోలేదని గుర్తుచేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమప్రాజెక్టులు కట్టడం వల్లనే ఎస్సారెస్పీ ఎండిపోతున్నదన్నారు.

538
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles