చేతనైతే జాతీయ హోదా కోసం పోరాడు


Sat,September 14, 2019 02:04 AM

Errabelli Dayakar Rao Fires On Bandi sanjay

-ఎంపీ బండి సంజయ్‌కి మంత్రి ఎర్రబెల్లి సవాల్
-కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి సహకరించడం లేదని వ్యాఖ్య

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి చేతనైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం పోరాడాలని పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం హిమ్మత్‌రావుపేటలో 30 రోజుల గ్రామ ప్రణాళికలో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. చరిత్రలో కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం అద్భుతమని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించడంలేదని చెప్పారు. వృద్ధాప్య పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తుంటే, కేంద్రం రూ.200 కోట్లు మాత్రమే ఇస్తున్నదని పేర్కొన్నారు. ఇటీవల పనిలేని వారు రాజకీయాలు చేస్తూ.. చీటికిమాటికి ధర్నాలకు కూర్చుంటున్నారని మండిపడ్డారు. ఇది సరికాదని ఆయన హితవుపలికారు.

362
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles