ఈవోడీబీలో అగ్రస్థానానికి కసరత్తు


Thu,May 16, 2019 01:21 AM

Eradication in EODB

-మూడు సంస్కరణలు పూర్తయితే వంద శాతం అమలు
-రెండేండ్లుగా ఈవోడీబీలో అగ్రస్థానంలో తెలంగాణ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సులభ వాణిజ్య విధానం (ఈవోడీబీ)లో సంస్కరణలన్నీ దాదాపు పూర్తికావచ్చాయి. జూన్ 15లోగా సంస్కరణలు పూర్తిచేయాల్సి ఉం డగా, మూడు మిగిలిపోయాయి. రెండేండ్లుగా ఈవోడీబీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తున్నది. ఈ ఏడాది కూడా టాప్‌లో నిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి పలుసార్లు సం బంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్షిం చారు. ఈవోడీబీలో తెలంగాణ 2016లో మొదటి ర్యాంకు, 2017లో రెండో ర్యాంకు సాధించింది. ఈసారి గతంలోని ప్రశ్నలన్నింటిని కలిపి మొత్తం ప్రశ్నల సంఖ్యను 80కి కుదించారు. గత సంస్కరణలన్నీ ఇందులో ఉండేలా ప్రశ్నలను రూపొందించారు. డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం, న్యాయశాఖ, సీసీఎల్‌ఏకు సంబంధించి సంస్కరణలు పూర్తిచేయాల్సి ఉన్నది.

వీటిలో డీపీఎంఎస్‌ను సీడీఎంఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ, హె చ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీలు అమలుచేయాల్సి ఉంటుంది. న్యాయశాఖ పరిధిలో ప్రత్యేకంగా కమర్షియల్ కోర్టులు ఏర్పాటుచేయాల్సి ఉన్నది. దీనిపై కసరత్తు జరుగుతున్నది. పూర్తిస్థాయిలో అమలుకాలేదు. సీసీఎల్‌ఏ పరిధిలో ల్యాండ్ రికార్డులు ఆన్‌లైన్ చేయాల్సి ఉం టుంది. సివిల్ కోర్టుల్లో ఉన్న కేసులను వాటితో అనుసంధించాల్సి ఉన్నది. వీటిని త్వరగా పూర్తిచేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ మూడింటిని పూర్తిచేసి వంద శాతం అమలుచేసిన రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలువాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు.

75
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles