విష్ణు కుండినుల రాజధాని వినుకొండ కాదన్న బీఎన్ శాస్త్రి


Fri,July 12, 2019 01:48 AM

enugu narasimha reddy speaks about b n sastris written vakataka mahadevi

తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: విష్ణుకుండినుల రాజధాని వినుకొండ కాదని బీఎన్‌శాస్త్రి ఆయన రచించిన వాకాటక మహాదేవిలో పేర్కొన్నారని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. రవీంద్రభారతిలోని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవలా స్రవంతి కార్యక్రమంలోభాగంగా శుక్రవారం బీఎన్ శాస్త్రి రచించిన చారిత్రక నవల వాకాటక మహాదేవిపై చరిత్ర పరిశోధకులు రామోజు హరగోపాల్ ప్రసంగం ఉంటుందని తెలిపారు.

శాతవాహనుల పతనం తరువాత శాలంకాయనులు, ఆనంద గోత్రికులు, ఇక్షాకులు, విష్ణుకుండినులు తెలుగుప్రాంతాలను సమాంతరంగా పాలించారని.. బౌద్ధం క్షీణిస్తూ వైదికమతానికి ఆదరణ పెరుగుతున్న కాలంలో నల్లగొండ జిల్లా రామన్నపేట మండలంలోని.. ప్రస్తుతం తుమ్మలగూడెంగా పిలుస్తున్న అలనాటి ఇంద్రపాలనగరం రాజధానిగా చేసుకొని విష్ణుకుండినులు తెలంగాణ ప్రాంతాన్ని పాలించారని చెప్పారు. అనేక శాసనాలను ఆధారంగా చేసుకొని విష్ణుకుండినుల రాజధాని వినుకొండ కాదని.. తుమ్మలగూడెం అని బీఎన్ శాస్త్రి నిరూపించారని చెప్పారు.

601
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles