HomeTelangana News

బ్రాహ్మణ సంక్షేమానికి భరోసా

Published: Tue,August 20, 2019 04:03 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

- ప్రభుత్వ పథకాలు అందేందుకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఏర్పాటు
- మూడేండ్లలో రూ.58.91 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం
- విదేశీ విద్య కోసం ఒకేరోజు రూ.10.80 కోట్లు మంజూరు
- బెస్ట్‌ పథకంతో పారిశ్రామిక, వ్యాపార వేత్తలకు ప్రోత్సాహం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పేదరికంలో మగ్గుతున్న బ్రాహ్మణుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి నిలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వీరిని ఉన్నతస్థితికి తెచ్చేందుకు సీఎం కే చంద్రశేఖర్‌రావు దూరదృష్టితో ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ (టీబీఎస్పీ) ద్వారా ప్రభు త్వ పథకాలు అందేలా చర్యలు తీసుకొంటున్నారు. 2017 ఏప్రిల్‌లో ఏర్పాటుచేసిన నాటినుంచి ఇప్పటివరకు బ్రాహ్మణుల ప్రగతి కోసం ప్రభుత్వం రూ.58.91 కోట్లు వెచ్చించింది. బ్రాహ్మణుల్లోని పేద కుటుంబాల బాగు కోసం ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కేటాయించిన బడ్జెట్‌తో పలు పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ద్వారా అమలుచేస్తున్నారు. టీబీఎస్పీ ద్వారా వివేకానంద విదేశీ విద్యాపథకం, రామానుజ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం, వేదపాఠశాలలకు ఆర్థిక సాయం, వేద, శాస్త్రపండితులకు గౌరవభృతి, వేద విద్యార్థులకు ఆర్థికసాయం వంటి సం క్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నది. మ రోవైపు రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణసదనాల నిర్మాణల పనులు కొనసాగుతున్నాయి. పేద బ్రాహ్మణులకు స్వయం ఉపాధి కల్పించడంతోపాటు వ్యాపార, పారిశ్రామికరంగాల్లో రాణించేలా ఆర్థిక చేయూత పథకాన్ని అమలుచేస్తున్నారు. బెస్ట్‌ పేరిట ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇప్పటివరకు 1500 మందికి పైగా లబ్ధి పొందారు. మూడేండ్లలో రూ.58,91, 61.263 మొత్తాన్ని ఖర్చుచేశారు.

విద్య, ఉపాధి కల్పనే లక్ష్యం

పేద బ్రాహ్మణులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యం గా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ కృషి చేస్తున్నది. విద్యార్థులతోపాటు వాణిజ్య, వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు వివిధ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తున్నాం. చిన్నతరహా కుటీర పరిశ్రమలు నెలకొల్పేందుకు సబ్సిడీ రుణాలు అందిస్తున్నాం. అన్ని జిల్లాలవారికి సమప్రాధాన్యం కల్పిస్తూ సంక్షేమ, ప్రగతి కార్యక్రమాలను అమలుచేస్తున్నాం. ఎంతో ఉన్నతాశయంతో సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన సంక్షేమ పరిషత్‌ ద్వారా అర్హులైనవారికి ఆయా పథకాలు అందేలా చర్యలు తీసుకొంటున్నాం.
KV-Ramanachary
- కేవీ రమణాచారి, చైర్మన్‌, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌

ఒకే రోజు 54 మందికి సాయం

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ద్వారా అమలుచేస్తున్న వివేకానంద విదేశీవిద్యా పథకం కింద ఒకేరోజు 54 మంది విద్యార్థులకు రూ.10.80 కోట్లు మంజూరుచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రాహ్మణ విద్యార్థులు విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించేందుకు నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతున్నది. ఒక్కొక్కరికి రూ.20 లక్షలు మంజూరుచేయడం సాహసోపేత నిర్ణయమని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.
RUCHIRA

ప్రభుత్వం వల్లే ఈ భాగ్యం కలిగింది

వివేకానంద విదేశీవిద్యా పథకం కారణంగానే విదేశాల్లో ఉన్నతవిద్య చదివే భాగ్యం కలిగింది. కాలిఫోర్నియా వర్సిటీలో మెటీరియల్‌ సైన్స్‌లో ఎమ్మెస్‌ చదివేందుకు వెళ్తున్నాను. ప్రభుత్వం సహకారం ఎప్పటికీ మరువలేనిది.
- రుచిర, విద్యార్థిని
KIREETI

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం

మధ్యతరగతికి చెందిన నాకు క్యాంప్‌బెల్స్‌ విల్లె యూనివర్సిటీలో ఫార్మాస్యుటికల్‌ సైన్సెస్‌లో ఎమ్మెస్‌ చదివే అవకాశం లభించింది. ప్రభుత్వం రూ.20 లక్షలు ఆర్థికసాయం అం దించడం చాలా గొప్ప విషయం. సీఎం కేసీఆర్‌కు ఎంతో రుణపడి ఉంటాం.
- కిరీటి, విద్యార్థి
SRIDHAR

పరిషత్‌ ఏర్పాటుతో సంక్షేమం

బ్రాహ్మణపరిషత్‌ ఏర్పాటుతోనే నాలాంటి ఎందరికో విదేశాల్లో ఉన్నతవిద్యకు ఆర్థిక సహాయం అందుతున్నది. కెనడాలో ఎంటెక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు చదివేందుకు అవకాశం దక్కింది.
- శ్రీధరాచార్యులు, విద్యార్థి
VASHNAVI

ఎంతో ఆనందంగా ఉంది

వివేకానంద విదేశీవిద్యా పథకం ద్వారా రూ.20 లక్షల సాయం అందించడం ఆనందంగా ఉన్నది. ఐటీలో ఎమ్మెస్‌ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్తున్నా. ప్రభుత్వ సహాయం వల్లనే కల సాకారమవుతున్నది. నాలాంటి అమ్మాయిలకు ఈ పథకం ఎంతో ఉపకరిస్తుంది.
- వైష్ణవి, విద్యార్థిని

Brahman-welfare

1086

More News