యాదాద్రి పునర్నిర్మాణం చారిత్రక నిర్ణయం


Fri,July 12, 2019 01:50 AM

Endowments Minister Allola Indrakaran Reddy visit Yadadri

- మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

యాదగిరిగుట్ట, నమస్తే తెలంగాణ/మట్టెవాడ(వరంగల్ అర్బన్): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర పునర్నిర్మాణంలో సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రకమని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం సతీసమేతంగా మంత్రి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో కలిసి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధాన దేవాలయం, మండ పం, గర్భగుడి, బాహ్య ప్రాకారాలు, అంతర ప్రాకారాలు, మాడవీధులు, రథశాల, వ్రత మంటపం పనులను పరిశీలించారు. ప నులు జరుగుతున్న తీరును చూసి సంతృప్తి వ్యక్తం చే శారు. ఆలయ పునఃప్రారంభ తేదీని సీఎం కేసీఆరే నిర్ణయిస్తారన్నారు. అనంతరం వరంగల్ భద్రకాళీ అమ్మవారి శాకంబరీ మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ దర్శించుకున్నారు.

211
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles