అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో అగ్రగామి

Thu,December 5, 2019 01:57 AM

-ఇస్రో పూర్వ డైరక్టర్ జయరామన్
-నిట్‌లో ఘనంగా విక్రం సారాభాయ్ జయంతి ఉత్సవాలు

నిట్‌క్యాంపస్ (వరంగల్): అంతరిక్ష పరిశోధనల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ(ఇస్రో) అగ్రగామిగా నిలిచి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచదేశాలతో పోటీపడుతున్నదని ఇస్రో పూర్వ డైరెక్టర్ జయరామన్ పేర్కొన్నారు. శాటిలైట్ల రూపకల్పనకు కృషి చేసిన విక్రం సారాభాయ్ లాంటి శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విక్రం సారాభాయ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఇస్రో ఆధ్వర్యంలో వరంగల్‌లోని నిట్ లో బుధ, గురువారాల్లో స్పేస్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారు. నిట్‌లోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్‌లో బుధవారం జయరామన్ జ్యోతి ప్రజ్వలనచేసి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇస్రో, నిట్‌తో పాటు వరంగల్ అర్బన్ జిల్లా, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, వరంగల్ సంయుక్తంగా విక్రం సారాభాయ్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. 1957లో రష్యా స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు, రాకెట్ల ఉపయోగాన్ని అప్పటి ప్రధాని నెహ్రూకు వివరించి విక్రం సారాభాయ్ అంతరిక్ష పరిశోధనల్లో కృషిచేశారన్నారు. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు, వరంగల్ అర్బన్ స్పెషల్ కలెక్టర్ మనుచౌదరి, విద్యాశాఖాధికారి నారాయణరెడ్డి, నిట్ స్టూడెంట్ డీన్ యల్‌ఆర్‌జీ రెడ్డి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ చైర్మన్ విజయ్‌చందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

194
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles