చెట్టంత కొడుకు పట్టించుకోక.. చెట్టు కిందే నివాసం


Sat,September 14, 2019 02:05 AM

Elderly couple joined the tree when the son did not care

-ఆదుకోవాలంటూ బెల్లంపల్లిలో వృద్ధ దంపతుల వేడుకోలు
బెల్లంపల్లి, నమస్తే తెలంగాణ: చెట్టంత ఎదిగిన కొడుకు పట్టించుకోకపోవడంతో వృద్ధ దంపతులు చెట్టుకిందకు చేరారు. మూణ్నెల్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు. ఇంట్లోకొస్తే పెట్రోల్ పోసి చంపుతామని కోడలు వేధిస్తున్నదని కన్నీరు పెట్టుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీకి చెందిన సాహెబ్ హుస్సేన్, షేక్ మహబూబీ దంపతులకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్దకొడుకు మృతిచెందగా, తల్లిదండ్రులు మూడేండ్లుగా రెండో కొడుకు మఖ్దూ మ్ వద్ద ఉన్నారు. దంపతులు మూణ్నెల్ల కిందట చిన్న కొడుకు ఫరీద్ వద్దకు వచ్చారు. వారు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో పీర్ల షెడ్డు వద్ద ఉన్న చెట్టుకింద నివాసం ఉంటున్నారు.

ఇంట్లోకి రానివ్వాలని నిత్యం గొడవచేస్తున్నా రు. ఇంట్లో అడుగుపెడితే పెట్రోల్ పోస్తామని కోడలు అమీనాబీ బెదిరింపులకు పాల్పడిందని, ఇంటికి తాళం వేసి కొడుకు, కోడలు వెళ్లిపోయారని వృద్ధ దంపతులు ఆరోపించారు. శుక్రవారం చిన్న కొడుకు ఇంటిముందే మంచం వేసుకుని కూర్చుకున్నారు. తాను సింగరేణిలో పనిచేసినప్పుడు ఉన్న క్వార్టర్‌లోనే కొడుకు, కోడలు ఉంటున్నారని, ఆ క్వార్టర్‌ను ఇప్పించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఈ దంపతులను ఇంటినుంచి వెళ్లగొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

641
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles