వృద్ధ దంపతుల ఆత్మహత్య

Sat,November 9, 2019 01:14 AM

మహదేవపూర్: వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉన్నా కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందిన దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఎలికేశ్వరంలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఎలికేశ్వరం గ్రామానికి చెందిన రాళ్లబండి సాలయ్య(76), రాధమ్మ(66) దంపతులకు కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వివాహం అనంతరం కొడుకు వేరుకాపురం పెట్టాడు. వృద్ధ దంపతులు ఆరోగ్యం సహకరించక వ్యవసాయం మానేసి ఇంటివద్దే ఉం టున్నారు. వృద్ధులు కావడం, బాగోగులు చూసేవారు లేరనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముందే నూతన వస్ర్తాలతోపాటు పురుగులమందు డబ్బా కొనుగోలు చేసి ఆత్మహత్యకు ముహూర్తం పెట్టుకున్నారు. దహన సంస్కారాల ఖర్చులకు రూ.20 వేలను తమవద్ద ఉంచుకుని శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు నూతన దుస్తులు ధరించి పురుగుల తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందరితో కలిసిమెలిసి ఉండే ఈ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం గ్రామస్థులను కలిచివేసింది.

731
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles