భద్రాచలంలో రేపు తెప్పోత్సవం


Sun,December 16, 2018 01:47 AM

ekadasi celebrations at bhadrachalam

-18న ఉత్తరద్వార దర్శనం
-బలరామావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రాముడు

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రంలో సోమవారం సీతారాముల జలవిహారం వేడుక జరగనున్నది. ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. పవిత్ర పావన గోదావరి నదీ తీరంలో నిర్వహించనున్న రాములోరి తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తికావస్తున్నాయి. సీతారాములు జలవిహారం చేసే హంస వాహనాన్ని అందంగా అలంకరించారు. సోమవారం జరిగే రాములోరి తెప్పోత్సవం, మంగళవారం నిర్వహించే ఉత్తర ద్వారదర్శనం వేడుకలకు వేలాది మంది భక్తులు భద్రాద్రికి వచ్చే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయన మహోత్సవాల్లో భాగంగా రామయ్యస్వామి శనివారం బలరామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

1109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles