నౌహీరా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం


Thu,May 16, 2019 02:21 AM

ED officials take Nowhera Shaikh into 7 days custody

-ఆర్థిక లావాదేవీలపై దృష్టి
-వెలుగులోకి సంచలన నిజాలు!

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వివిధ స్కీంల పేరిట లక్షల్లో వినియోగదారుల నుంచి వేల కోట్లరూపాయల మోసాలకు పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ నౌహీరా షేక్ కేసు లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణను ముమ్మరం చేశారు. నౌహీ రా విచారణలో పలు కీలకాంశాలు బయటికి వస్తున్నట్టు సమాచారం. నౌహీరాను ఏడురోజుల కస్టడీకి తీసుకొన్న ఈడీ అధికారులు.. బుధవారం పలు అంశాలపై ప్రశ్నించారు. ఇప్పటికే సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తెలుసుకొన్న అంశాలు, తమ దర్యాప్తులో సేకరించిన సమాచారంతో క్రాస్‌చెకింగ్ చేసుకొంటూ విచారిస్తున్నట్టు తెలిసింది. నౌహీరాతోపాటు ఆమెకు సహకరించిన బిజూథామస్, మౌళీథామస్ కూడా ఈడీ కస్టడీలోనే ఉన్నారు.

ముగ్గురిని వేర్వేరుగా ప్ర శ్నిస్తున్నట్టు తెలిసిం ది. కంపెనీ లావాదేవీలపై ఐటీ, ఈడీ, ఆర్వోసీ (రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్) లకు ఒక్కో సంస్థ దగ్గర ఒక్కో తరహా లావాదేవీలను చూపినట్టు ఈడీ అధికారుల విచారణలో తేలడంపైనా సమాచారం సేకరిస్తున్నారు. ఇలాఉండగా, దేశవ్యాప్తంగా నౌహీరా గ్రూప్ 1.72 లక్షల మంది నుంచి దాదాపు రూ.3 వేల కోట్ల మేర పెట్టుబడులు వసూలుచేసి వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకొన్నారని, 24 కంపెనీల పేర్లతో 182 బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు మళ్లింపు జరిగినట్టు పలు మీడియా వార్తల్లో వస్తున్న సమాచారంపైనా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది.

100
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles