ఎన్నికలకు సర్వం సిద్ధం!


Thu,September 13, 2018 01:45 AM

EC chief OP Rawat says predictions on schedule for Telangana election

-సీఈసీ నిర్ణయమే తరువాయి
-నవంబర్‌లో ఎన్నికలు వచ్చే అవకాశం.. ప్రక్రియ వేగవంతం
-కేంద్ర అధ్యయన బృందం పరిశీలనలో సానుకూల స్పందన
-ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో చర్చ
-ఎన్నికల నిర్వహణకు సిద్ధమన్న సీఈసీ ఓపీ రావత్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అతిత్వరలో వచ్చే అవకాశాలున్నాయి. ఇం దుకోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తున్నది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఉన్న పరిస్థితులు, అధికారుల సన్నద్ధత, ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృం దం ఆరాతీసింది. ఓటర్ల జాబితా ముసాయిదా సవరణ నుంచి మొదలుకొని పోలింగ్ బూత్‌ల ఏర్పా ట్లు, ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పనితీరు, పోలీసు బందోబస్తు తదితర అంశాలపై కేంద్ర నుంచి వచ్చిన బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం. ఇదిలాఉండగా, ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్.. తెలంగాణలో ఎన్నికలు జరిపేందుకు సిద్ధమని పరోక్షంగా ప్రకటించారు. రెండ్రోజులుగా కేంద్ర ఎన్నికల సం ఘం ప్రతినిధులు రాష్ట్రంలోని రాజకీయపార్టీలతో చర్చించారు. అలాగే జిల్లా కలెక్టర్లు, పోలీసు బాసులతో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 6న తెలంగాణ ప్రభుత్వం రద్దయిన నాటినుంచి రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఎన్నికల సంఘం అధ్యయనం చేస్తున్నది. త్వరగా ఎన్నికలు నిర్వహించే ప్రక్రియలో భాగంగానే కేంద్ర బృందం పర్యటన ఖరారైంది.

ఏర్పాట్లపై అధికారులతో ఆరా

బుధవారం ఉదయం సీనియర్ డీఈసీ ఉమేశ్‌సిన్హా నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమైం ది. జిల్లాలవారీగా పరిస్థితులను అడిగి తెలుసుకొన్నది. సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రాజేశ్వర్‌తివారి, ఎక్సైజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌తో భేటీ అయి ఎన్నికల నిర్వహణకు అధికారయంత్రాంగం సన్నద్ధతపై స మాచారం అడిగినట్టు తెలిసింది. ఓటర్ల జాబితాకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు శాంతిభద్రతల పరంగా ఎలాం టి సమస్యలు ఉత్పన్నం కాబోవని భావిస్తున్నట్టు కేంద్ర ప్రతినిధి బృందం వ్యాఖ్యానించినట్టు ఓ అధికారి తెలిపారు. వీవీ పాట్స్, ఈవీఎంలపై ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కేంద్ర ప్రతినిధి బృందం సూచించినట్టు సమాచారం. మొత్తంగా ఎన్నికలకు సంబంధించి సన్నద్ధతపై అధికారుల నుంచి సేకరించిన సమాచారంపై ఈసీ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది.

ELECTION

నివేదిక ఆధారంగా నిర్ణయం

రాష్ట్రంలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్‌సిన్హా మీడి యా సమావేశంలో ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రం లో త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయనే వాదన బలంగా వినిస్తున్నది. కేంద్ర బృందం తన అధ్యయన నివేదికను అందించిన వెంటనే ఎన్నికల నిర్వహణపై సీఈసీ నిర్ణయం తీసుకోనున్నది. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టుగా కలెక్టర్లు, ఎస్సీల సమావేశంలో తేలడంతో ఏర్పాట్లపై మరింత వేగంగా చర్య లు చేపట్టే అవకాశాలున్నాయి. రాష్ట్ర అధికారుల నుంచి సేకరించిన సమాచారంపై నివేది క రూపంలో సీఈసీకి ప్రతినిధుల బృందం అందించనున్నది.

ఎన్నికల నిర్వహణకు సిద్ధం: ఓపీ రావత్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్దమేనని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ పరోక్షంగా తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాటాడారు. అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత 6 నెలలు దాటకముందే ఎన్నికలు జరుపాలని ఇదివరకే సుప్రీంకోర్టు ఆదేశించిందని రావత్ చెప్పారు. నిబంధనల ప్రకారం మార్చి 5 నాటికల్లా తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉందన్నారు. తెలంగాణలో పర్యటిస్తున్న ప్రతినిధులు బృందం నివేదిక అందగానే నిర్ణయం తీసుకొంటామని ఓపీ రావత్ చెప్పారు.

ఆసిఫాబాద్ జిల్లాకు చేరిన ఈవీఎంలు

-బెంగళూరులోని బెల్ కంపెనీ నుంచి రాక
-గోదాంలో భద్రపరిచిన అధికారులు
ELECTION2
రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొ న్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు చేరుకుంటున్నా యి. మొట్టమొదటగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు యంత్రాలు అందాయి. ఆసిఫాబాద్ ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ బౌమిక్ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారుల బృందం బెంగళూరు నుంచి బుధవారం ఈ యంత్రాలను తీసుకువచ్చింది. బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కంపెనీ నుంచి వీటిని తీసుకువచ్చారు. వాహనానికి ఉన్న సీలును వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచారు. అనంతరం బాక్సులను దించి గోదాంలో భద్రపరిచారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలను 152 ఐరన్ బాక్సు లో అధికారులు జిల్లాకు చేర్చారు. 85 బాక్సుల్లో 850 బ్యాలెన్సింగ్ యూనిట్లు (బీయూ), 67 బాక్సుల్లో 670 కాంటాక్టు యూనిట్ల్లు (సీయూ) ఉన్నాయి. మరో మూడునాలుగు రోజుల్లో హర్యానా నుంచి జిల్లాకు అవసరమైన 720 వీవీప్యాట్లను తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాక్సులు భద్రపరిచిన గది వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.

సీఈవోకు కొత్త కొలువులు మంజూరు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో 16 కొత్త పోస్టులు మంజూరయ్యాయి. ఒక అదనపు సీఈవో, ఒక సంయుక్త సీఈవో, ఒక సహాయ సీఈవో, మూడు సహాయ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, ఒక స్టోర్ సూపర్‌వైజర్, ఐదుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, నలుగురు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కొత్త పోస్టులు మంజూరుచేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

3464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS