పట్టాలివ్వండి లేదా..ప్రాణం తీసుకోనివ్వండి


Wed,June 12, 2019 02:12 AM

Duggondi Mandal farmers who are angry at the JC

-జేసీకి మొరపెట్టుకున్న దుగ్గొండి మండల రైతులు
-దుగ్గొండిలో తాసిల్దార్, వీఆర్వోలపై చర్యలు తీసుకోవాలని ధర్నా
-అర్హులకు పట్టాలిస్తామని జాయింట్ కలెక్టర్ హామీ

దుగ్గొండి: భూములకు పట్టాలు ఇవ్వాలని వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండల రైతులు మంగళవారం జాయింట్ కలెక్టర్ మహేందర్‌రెడ్డికి మొరపెట్టుకొన్నారు. మంగళవారం జేసీ తాసిల్దార్ కార్యాలయానికి వస్తున్నారని తెలుసుకొన్న దుగ్గొండి మండలంలోని నాచినపల్లి, తొగర్రాయి, లక్ష్మీపురం, దేశాయిపల్లి, రేఖంపల్లి, వెంకటాపురం, ముద్దునూరు, స్వామిరావుపల్లి, జాఫర్‌పల్లి గ్రామాల రైతులు అక్కడికి చేరుకొన్నారు. తాసిల్దార్, వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని, వారిని సస్పెండ్‌చేయాలని డిమాండ్‌చేశా రు. తాసిల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నాచేశారు. తాసిల్దార్, వీఆర్వో అవినీతి నశించాలని నినాదాలుచేశారు. తాసిల్ కార్యాలయం లో వీఆర్వోలతో సమావేశమైన జేసీ బయటకు రావాలని రైతులు కోరారు. బయటకు వచ్చిన జేసీని దాదాపు గంటసేపు చుట్టుముట్టి ఘెరావ్‌చేశారు. తమ సమస్యలపై తాసిల్దార్, వీఆర్వో వ్యవహరించిన తీరును వివరించారు. సాదాబైనామా కింద దరఖాస్తు చేసుకొన్న తమకు పట్టాలు ఇవ్వడంలేదని పేర్కొన్నారు. భూముల కు పట్టాలు అయినా ఇవ్వండి.. ప్రాణాలైనా తీసుకోనివ్వండంటూ జేసీతో ఆవేదనతో అన్నా రు. భూములకు పట్టాలు ఇవ్వాలని రైతులు జే సీ మహేందర్‌రెడ్డి కాళ్లు మొక్కారు. దీంతో చలించిన జేసీ రైతులు దరఖాస్తులను పరిశీలించి వారంలోగా పట్టాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యు అధికారులను ఆదేశించారు.
bandikomaramma

నా బిడ్డను అల్లుడు హింసిస్తున్నాడు

మాది దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామం. నా బిడ్డకు కట్నం కింద 1.30 ఎకరాల భూమి ఇచ్చిన. ఏడాది క్రితం సాదాబైనామాలో పట్టాకోసం దరఖాస్తు చేసుకొన్నా అధికారులు పట్టా ఇవ్వలేదు. పట్టాపుస్తకం లేకపోవడంతో రైతుబంధు రావడంలేదు. దీంతో నా అల్లుడు బిడ్డను హింసిస్తున్నాడు.
- బండి కొమరమ్మ, తొగర్రాయి మహిళా రైతు

అర్హులైన రైతులకు పట్టాలు అందిస్తాం

దుగ్గొండి మండలంలోని వివిధ గ్రామాల రైతులకు అధికారుల నిర్లక్ష్యంతో పట్టాలు రాక రైతుబంధు కోల్పోవడం వాస్తవమని జాయింట్ కలెక్టర్ మహేందర్‌రెడ్డి అన్నారు. అటువంటి అధికారులపై చర్యలు తీసుకొని పట్టాలు రాని రైతులందరికీ పట్టాలిస్తామని చెప్పారు. మండలంలోని రెవెన్యు అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ నిమిత్తం వెళ్ల్లిన తనకు రైతులు సమస్యలు చెప్పకొన్నారని, వెంటనే వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారని జేసీ పేర్కొన్నారు.
- మహేందర్‌రెడ్డి జేసీ

649
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles