అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్ట


Tue,April 16, 2019 01:52 AM

DTCP created new rules

-లేఅవుట్లు వేస్తే 15 శాతం స్థలం తనఖా పెట్టాలి
-అక్రమ లేఅవుట్లు వేసిన వారి నుంచి పదిరెట్లు పరిహారం వసూలు
-కొత్త నిబంధనలను రూపొందించిన డీటీసీపీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో అక్ర మ లేఅవుట్లకు అడ్డుకట్ట వేసేందుకు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) పకడ్బందీ ప్రణాళికలు రూపొదించింది. గ్రామపంచాయతీల్లో లంచాల్లేని వ్యవస్థ ఏర్పాటు కావాలని ఇటీవల సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన డీటీసీపీ పంచాయతీల్లో కట్టుదిట్టమైన లేఅవుట్ నిబంధనలను రూపొందించింది. దీని ప్రకారం.. పంచాయతీల్లో కొత్తగా లేఅవుట్లు వేసే ప్రతి రియల్టర్ 15 శాతం స్థలాన్ని తనఖా పెట్టాలనే కొత్త నిబంధనను విధించింది. నిబంధనల ప్రకారమే లేఅవుట్‌లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశామని ఆధారాలు చూపి తే అట్టి తనఖా విడుదలవుతుంది. ఇప్పటికే పుట్టగొడుగుల్లా వెలిసిన అక్రమ లేఅవుట్లపై తీసుకోవాల్సిన చర్యలను కొత్తచట్టంలో పొం దుపరిచారు.

కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోలేని ప్రాంతాల్లో డీటీసీపీ కొత్త లేఅవుట్లకు అనుమతినిస్తుంది. ఈ నిబంధనను అధికశాతం పంచాయతీలు తుంగలో తొక్కాయి. సరైన అనుమతుల్లేకుండానే.. వివిధ ప్రాంతా ల్లో వందల ఎకరాల్లో లేఅవుట్లు వెలిశాయి. ఎవరికి వారే ఇష్టం వచ్చినట్టు లేఅవుట్లను అభివృద్ధిచేశారు. ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రం లో తెరలేసిన ఈ అక్రమ తంతుకు చరమ గీతం పాడాలని సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామపంచాయతీల్లో అక్రమ లేవుట్ల జాబితాను డీటీసీపీ సిద్ధం చేస్తున్నది. ప్రతి పంచాయతీలో ఉపగ్రహ చిత్రాల సాయంతో ఆయా లేఅవుట్ల తనిఖీ చేసి, అందులోని అక్రమాల శాతం ప్రకారం లేఅవుట్లను విభజించి వాటి వివరాలు అధికారికంగా రూపొందిస్తుంది.

పదిరెట్లు పరిహారం..

భవిష్యత్‌లో అక్రమ లేఅవుట్లు వేలువకుండా ఉండేందుకు, ప్రస్తుతం అక్రమ లేఅవుట్లు వేసిన రియల్టర్ల నుంచి ఇకపై భారీగా పరిహారాన్ని వసూలుచేస్తారు. పంచాయతీ పరిధిలో అక్రమ లేఅవుట్లు వేసి.. అందులో వెడల్పు రోడ్లు, ఉమ్మడి సౌకర్యాలను కల్పించకపోతే, ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపాలనే నిబంధనను కొత్త చట్టంలో పొందుపరిచా రు. ఆయా లేఅవుట్‌లో ఖాళీ ప్లాట్లు లేకపోతే, అట్టి సౌకర్యాల కోసం వదిలేయాల్సిన ఖాళీ స్థలాన్ని లెక్కించి.. దానిపై పదిరెట్లు మార్కెట్ విలువను అట్టి గ్రామపంచాయతీకి రియల్టర్ పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. అప్పటి మార్కెట్ విలువను బట్టి పరిహారాన్ని చెల్లించాల్సిందే తప్ప లేఅవుట్ వేసిన తేదీ ప్రకారం కడుతామంటే ఒప్పుకోరు. అక్రమ లేఅవుట్లు వేయాలనుకొని పనులు ప్రారంభించని లేఅవుట్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. పంచాయతీకి అధిక ఆదాయాన్నిచ్చేలా కొత్త లేఅవుట్ నిబంధనల్ని డీటీసీపీ రూపకల్పనచేసింది. సంబంధిత పంచాయతీలో అక్రమ లేఅవుట్లు వేశాక.. అందులో మౌలిక సదుపాయాలను కల్పించకపోతే అక్కడి పంచాయతీపై ఒత్తిడి పెరుగుతుంది.

ఉదాహరణకు, అక్కడి విద్యుత్, డ్రైనేజీ వంటివి ఆయా లేఅవుట్లలో ఇల్లు కట్టుకొని నివసించేవారికి పంచాయతీనే సమకూర్చాలి. అందుకే, ఇలాంటి అక్రమ లేఅవుట్ల నుంచి.. కనీసం మూడు రెట్లు పరిహారాన్ని గ్రామపంచాయతీకి సంబంధిత రియల్టర్లు చెల్లించక తప్పదు. లేఅవుట్‌లో రోడ్లు వెడల్పు చేయకున్నా.. ఉమ్మడి సౌకర్యాలను కల్పించకున్నా.. వాటిని అభివృద్ధి చేయడానికి అంగీకరిస్తారు. కాకపోతే, కనీసం ఐదురెట్లు పరిహారంగా రియల్టర్లు పంచాయతీకి చెల్లించాల్సి ఉంటుంది. లేఅవుట్లను అభివృద్ధి చేయడానికి అనుమతి తీసుకొని, సకాలంలో అభివృద్ధి పనులను చేపట్టకపోతే, ఆయా పనిని పూర్తి చేయడానికి కొంత గడువు ఇస్తారు. లేఅవుట్‌కు అనుమతి తీసుకున్నాక.. దాని గడువు ముగిసిపోతే, మళ్లీ అనుమతిని పునరుద్ధరిస్తారు.

1228
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles