ఐదు నెలల్లో అందరికీ తాగునీరుWed,January 11, 2017 02:19 AM

ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు నాలుగు దశాబ్దాల కన్నీటి వ్యథ. సగటు ప్రతి వేసవిలో హైదరాబాదీ అనుభవిస్తున్న వెతల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే జూలైకల్లా ఈ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తితో తాగునీటి సరఫరాకు జల మండలి శ్రమిస్తున్నది.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ వాసులకు ఇంటింటికీ రక్షిత మంచినీటిని సరఫరాచేస్తామన్న హామీ నిలుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అతివేగంగా అడుగులేస్తున్నది. సుమారు రూ.1,900 కోట్ల అంచనా వ్యయంతో 50 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చేందుకు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నేతృత్వంలో జోరుగా 56 రిజర్వాయర్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించగా, హడ్కో రూ.1,700 కోట్ల రుణం అందించింది.
RESERVIOR
తొలుత అల్వాల్, కాప్రా, ఉప్పల్, రామచంద్రాపురం సర్కిళ్ల పరిధిలో రిజర్వాయర్లు.. మలిదశలో కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, గడ్డిఅన్నారం, రాజేంద్రనగర్.. తుదిదశలో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు సర్కిళ్లలో నీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నది. ప్రాజెక్టు నిర్మాణ గడువు రెండేండ్లు కాగా, ఈ ఏడాది జూన్ / జూలైలోగా పూర్తిచేసేందుకు జల మండలి పనులు చేపట్టింది. ఒక్కో రిజర్వాయర్ 22.5 మిలియన్ లీటర్లలోపు నిల్వ సామర్థ్యంతో 54 రిజర్వాయర్ల నిర్మాణం చురుగ్గా సాగుతున్నది. మియాపూర్, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ కాలనీల రిజర్వాయర్ల పైకప్పు శ్లాబ్‌లు వేయగా, మిగతావీ ఆ స్థాయికి చేరుకున్నాయి. ఇక కౌకూరు, జొన్నాబండ రిజర్వాయర్ల నిర్మాణానికి స్థలం సేకరించాలి. ఇక నగరం నలుమూలల 2500 కిలోమీటర్ల పొడవున పైపులైన్లకు గాను 500 కిమీ విస్తీర్ణంలో నిర్మాణం పూర్తయింది.

కృష్ణా నీరు ఇక్కడ్నుంచే..


నాగార్జున సాగర్ నుంచి సాహెబ్‌నగర్ వరకూ నేరుగా నీరు సరఫరా అవుతుంది. అక్కడ్నుంచి రాజేంద్రనగర్ మీదుగా షేక్‌పేట్, ప్రశాసన్‌నగర్‌కు నీరు చేరుతుంది. మరో రింగ్ ద్వారా సాహెబ్‌నగర్ నుంచి ఎల్బీనగర్‌కు చేరుకుంటుంది. రెండో రింగ్ మెయిన్‌లో సాహెబ్‌నగర్ నుంచి ఉప్పల్ మీదుగా తార్నాక, సికింద్రాబాద్‌లకు చేరుతుంది.

గోదావరి నీరు ఇలా..


గోదావరి నది నుంచి వచ్చే నీరు శామీర్‌పేట మీదుగా ఘన్‌పూర్ బాలెన్సింగ్ రిజర్వాయర్‌కు చేరుతుంది. అక్కడ్నుంచి మేడ్చల్ చెక్‌పోస్టు నుంచి కుత్బుల్లాపూర్, హఫీజ్‌పేట్‌కు నీటి సరఫరా అవుతుంది. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రామచంద్రపురం వాసులకు కొత రిజర్వాయర్ల ద్వారా మంచినీరు లభిస్తుంది. రెండో రింగ్ మెయిన్ పరిధిలో శామీర్‌పేట్ నుంచి అల్వాల్ మీదుగా సైనిక్‌పురికి గోదావరి నీరు సరఫరా అవుతుంది.

పనుల్లో యమజోరు..


ప్రస్తుతం శివారు ప్రాంతాలకు రెండు నుంచి ఐదు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతున్నది. రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయితే సుమారు 50 లక్షల మంది ప్రజలకు ప్రతిరోజూ తాగునీరు అందుబాటులోకి వస్తుంది. వచ్చే జూన్, జూలై నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ వాసుల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
- దానకిశోర్, ఎండీ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్

ప్రాంతాల వారీగా నీటి సరఫరాకు గల అవకాశాలు


సర్కిల్ రిజర్వాయర్ల మిలియన్
సంఖ్య లీటర్లు
ఉప్పల్ 4 16.00
కాప్రా 6 34.50
అల్వాల్ 6 37.50
రామచంద్రాపురం 3 7.50
కుత్బుల్లాపూర్ 6 27.50
ఎల్‌బీనగర్, గడ్డిఅన్నారం,
రాజేంద్రనగర్ 13 57.50
శేరిలింగంపల్లి 11 43.00
కూకట్‌పల్లి 6 38.75
పటాన్‌చెరు 1 15.00

1682
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS