నేటి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు


Thu,May 23, 2019 01:54 AM

Dost registrations from today

-డిగ్రీలో ప్రవేశాల కోసం జూన్ 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
-మీ సేవ, ఈ సేవ, మొబైల్‌యాప్, 92 కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లకు అవకాశం
-25 నుంచి జూన్ 3 వరకు వెబ్‌ఆప్షన్లు.. జూలై 1 నుంచి డిగ్రీ తరగతులు
-ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక నోటిఫికేషన్
-షెడ్యూల్ విడుదలచేసిన విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభంకానున్నది. జూన్ మూడోతేదీ వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. మీ సేవ, ఈ సేవతోపాటు ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 92 సహాయకేంద్రాలు, మొబైల్ యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. ఈ నెల 25 నుంచి వెబ్‌ఆప్షన్ల నమోదుకు చాన్స్ ఇచ్చా రు. తొలివిడుత సీట్లనుజూన్ పదిన కేటాయిస్తారు. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కు 15 వరకు గడువు విధించారు. ఈ రకంగా మూడువిడుతల్లో జూన్ 25 వరకు కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ మేరకు డిగ్రీ ఆన్‌లైన్ సిస్టం ఆఫ్ తెలంగాణ (దోస్త్)-2019 నోటిఫికేషన్‌తోపాటు పూర్తి షెడ్యూల్‌ను విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి బుధవారం విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గురువారం నుంచి జూన్ 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పా రు. విద్యార్థులు ఈ నెల 25 నుంచి జూన్ 3 వరకు నిర్వహించే దోస్త్ వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని సూచించారు.

రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200గా నిర్ణయించామని, రూ.400 ఆల స్య రుసుంతో జూన్ నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. జూన్ 1, 3, 4 తేదీల్లో పీహెచ్‌సీ, స్పోర్ట్స్ వంటి ప్రత్యేక క్యాటగిరీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉంటుంద న్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులందరికీ తప్పనిసరిగా డిగ్రీ కాలేజీల్లో సీటు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇంటర్‌లో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు వెళ్లిన విద్యార్థులకు సైతం అవకాశం ఉంటుందని భరోసా ఇచ్చారు. జూన్ ఏడున ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే వారికి కూడా డిగ్రీలో సీట్లు కల్పిస్తామని, అందుకోసం దోస్త్ ప్రత్యేక నోటిఫికేషన్ జారీచేస్తామని తెలిపారు. అక్రమమార్గాల్లో ప్రవేశాలు చేసుకోవాలని కొన్ని ప్రైవేటు డిగ్రీ కాలేజీలు చూస్తున్నాయని, ఈ విషయంలో పట్టుబడితే వాటి అనుబంధ గుర్తింపు రద్దుచేస్తామని హెచ్చరించారు.

దేశంలోనే తొలిసారిగా ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు: దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి

డిగ్రీ కాలేజీల్లో సీట్లను ఆన్‌లైన్ విధానంలో భర్తీ చేయడం దేశంలోనే రాష్ట్రం తొలిస్థానంలో ఉందని దోస్త్-2019 కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి చెప్పారు. మీ సేవ, ఈ సేవతోపాటు 92 సహాయ కేంద్రాలు వల్ల, మొబైల్ యాప్, దోస్త్ రి జిస్ట్రేషన్ ప్రక్రియలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇంటర్ బోర్డు నుంచి విద్యార్థుల డాటా స్వీకరించామని, దోస్త్‌కు దరఖాస్తుచేసుకున్నవారెవ్వరూ తమ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు జతచేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. దోస్త్ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థుల డాటా క్యాప్చర్ చేస్తామని, దీనివల్ల ఆర్థికభారంతోపాటు శ్రమ తగ్గుతుందని అన్నా రు. దోస్త్‌పై సందేహాల నివృత్తి కోసం పాత పది జిల్లాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామని, రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కోఆర్డినేటర్లను నియమించామని చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీలో నేరు గా రిపోర్టు చేయకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ విధానం ప్రవేశపెట్టామని, కాలే జీ ఫీజులు ఆన్‌లైన్, టీవాలెట్ ద్వారా చెల్లించేలా ప్రణాళికలు సిద్ధంచేశామన్నారు. దోస్త్‌పై విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఎస్సెమ్మెస్ అలర్ట్ మెసేజ్‌లను పంపిస్తామని తెలిపారు.
TSCHE2

1040
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles