దోస్త్ దరఖాస్తులు 23 నుంచి


Thu,May 16, 2019 01:43 AM

dost applications from 23rd

-22న నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీస్ తెలంగాణ-దోస్త్) దరఖాస్తుల స్వీకరణ నోటిఫికేషన్ జారీ ఈ నెల 22కి వాయిదా పడింది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 23 నుంచి ప్రారంభిస్తారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం (15న) నోటిఫికేషన్ జారీచేసి, గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు ఈ నెల 27న విడుదల కానున్నాయని, అందుకే దోస్త్-2019 షెడ్యూల్‌లో మార్పులు చేశామని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. బుధవారం సాయంత్రం విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారని చెప్పారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఏ అశోక్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే పాల్గొన్నారు.

835
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles