వరద సమయంలో వినియోగం లెక్కలొద్దు


Thu,September 12, 2019 02:43 AM

Do not count consumption during floods

-సముద్రంలో కలిసే జలాలను వాడుకుంటేనే ప్రయోజనం
-కృష్ణాబోర్డుకు ఏపీ జలవనరులశాఖ లేఖ
-అభిప్రాయం చెప్పాలని తెలంగాణను కోరిన బోర్డు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కృష్ణాబేసిన్‌లో వరద ఉధృతంగా వస్తున్న సమయంలో ఆయా రాష్ట్రాలు వినియోగించుకునే నీటిని వాటాల కింద లెక్కించకుండా.. స్వేచ్ఛగా వాడుకునేలా చూడాలని ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు కృష్ణానదీ యాజమాన్యబోర్డుకు లేఖ రాశారు. ప్రస్తుతం కృష్ణాబేసిన్‌లో ఎగువ నుంచి దిగువ వరకు ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయని, ఈ నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్న జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయారాష్ర్టాలు తమ అవసరాలకు వాడుకుంటున్న నీటిని వినియోగం ఖాతాలో నమోదుచేస్తున్నారని, దీంతో ప్రాజెక్టు అధికారులు తమవాటా త్వరితగతిన పూర్తవుతుందనే ఉద్దేశంతో ఎక్కువ నీటి పరిమాణాన్ని వాడుకొనేందుకు ఇష్టపడటం లేదని పేర్కొన్నారు.

జలాలు సముద్రంలోకి వృథాగా పోయే బదులు కాల్వల ద్వారా తరలిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. సముద్రంలోకి జలాలు వృథాగా పోవడంపై ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా నుంచి విమర్శలు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనపై తెలంగాణ అభిప్రాయాన్ని కూడా తెలుసుకొని సరైన ఆదేశాలు జారీ చేయాలని ఈఎన్సీ వెంకటేశ్వరరావు కోరారు. బోర్డు సభ్యకార్యదర్శి ఈ లేఖను తెలంగాణ నీటిపారుదలశాఖకు పంపుతూ.. అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా సూచించారు.

99
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles