జిల్లా కోర్టుల్లో ఐసీజేఎస్, ఎన్‌ఎస్‌టీఈపీ

Thu,December 5, 2019 02:05 AM

- వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో ఇంటర్‌ఆపెరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం (ఐసీజేఎస్), నేషనల్ సర్వీస్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రాసెసెస్ (ఎన్‌ఎస్‌టీఈపీ) ప్రాజెక్టును హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ బుధవారం హైకోర్టులో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ వ్యవస్థ ద్వారా సంబంధిత విభాగాల మధ్య డాటా మార్పిడి సులభతరం కానున్నది. ఒకేరకమైన డాటాను పలుమార్లు వివిధ విభాగాల్లో నమోదుచేయాల్సిన అవసరం లేకుండా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, డీజీపీ మహేందర్‌రెడ్డి, రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

112
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles